Naa Sami Ranga Movie Trailer : కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా.. నా సామిరంగా ట్రైల‌ర్ విడుద‌ల‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Naa Sami Ranga Movie Trailer : కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా.. నా సామిరంగా ట్రైల‌ర్ విడుద‌ల‌..!

Naa Sami Ranga Movie Trailer : అక్కినేని నాగార్జున  Akkineni Nagarjun హీరోగా విజయ్ బన్నీVijay Bunny  దర్శకత్వంలో ‘ నా సామి రంగా ‘  Na Sami Ranga Movie సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. పవన్ కుమార్ సమర్పకులు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, Allari Naresh రాజ్ తరుణ్ Raj Tarun  కూడా నటించారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :9 January 2024,7:40 pm

ప్రధానాంశాలు:

  •  Naa Sami Ranga Movie Trailer : కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా.. నా సామిరంగా ట్రైల‌ర్ విడుద‌ల‌..!

Naa Sami Ranga Movie Trailer : అక్కినేని నాగార్జున  Akkineni Nagarjun హీరోగా విజయ్ బన్నీVijay Bunny  దర్శకత్వంలో ‘ నా సామి రంగా ‘  Na Sami Ranga Movie సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. పవన్ కుమార్ సమర్పకులు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, Allari Naresh రాజ్ తరుణ్ Raj Tarun  కూడా నటించారు. గతంలో టీజర్ విడుదల చేశారు. అది అందరిని ఆకట్టుకుంది. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ రెండు నిమిషాలు 33 సెకండ్ల నిడివి కలిగి ఉంది. అల్లరి నరేష్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభించారు. ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా అంటూ అల్లరి నరేష్ అడగ్గా కొందరు రౌడీలు నాగార్జున మీదకు దూసుకు వస్తారు. లుంగీ కట్టుకొని స్టైల్ గా బీడీ తాగుతూ నాగార్జున వారితో ఫైటింగ్ చేయడం అదిరిపోయింది. తర్వాత రాజ్ తరుణ్ ఈల వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.

అరే అంజి ఏస్కో అంటూ నాగార్జున చెప్పగానే అల్లరి నరేష్ డబ్బులు కొడుతుండగా డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత అన్నయ్య వరాలు నిన్ను రమ్మంటుంది అంటూ నాగార్జునకు చెబుతూ కనిపిస్తాడు. ఆ వెంటనే హీరోయిన్ల పాత్రలు కూడా పరిచయం చేశారు. హీరోయిన్ ఆషికారంగనాథ్ అందంగా ముస్తాబై కారులోంచి దిగుతుండగా..రాజ్ తరుణ్ ఆమె ఎవరని అడుగుతాడు. వెంటనే అల్లరి నరేష్ మన క్రిష్ణయ్య లవ్స్ అంటూ చెప్పగా..రాజ్ తరుణ్ నోరెళ్ళ పెడతాడు. వెంటనే కృష్ణయ్య నరకడం తెలుస్తాది కానీ సరసం ఎలా తెలుస్తది అంటాడు. ఆ వెంటనే నాగార్జున మీసాలు మెలేస్తూ హీరోయిన్ ను చూస్తాడు. ఇంత అందంగా ముస్తాబయి వచ్చావ్ ఏంటి అడుగుతాడు. ఆషికా నాగార్జునను చూసే విధానం అయితే అదిరిపోయింది. నువ్విట్ట సినిమాకు వస్తే నా సామి రంగా అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ మరింతగా ఆకట్టుకుంది.

అటు తర్వాత విలను పరిచయం చేసి మాస్ యాంగిల్ లోకి టర్న్ తీసుకున్నారు. నాగార్జున యాక్షన్ ఎపిసోడ్స్ లో తన గ్రేస్ ని చూపించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో జరిగే కథ ఇది అని స్పష్టం అవుతుంది. గ్రామీణ వాతావరణం లో జాతర సెటప్ వంటివి కూడా ట్రైలర్లో చూపించారు. సంక్రాంతి పండుగకి తగ్గ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నాగార్జున మాస్ యాంగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో హీరోయిన్గా ఆషికా రంగనాథన్ నటించారు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకి కథను అందించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే శివేంద్ర దాశరధి సినిమా ఆటోగ్రాఫర్గా పనిచేస్తుండగా, ఛోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వపోతుంది. ముఖ్యంగా 14వ తేదీ భారీ ఎత్తున అంచనాల నడుము విడుదల కాబోతుంది.

anusha

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక