Viral Video : బుల్లెట్ బండి సాంగా మజాకా.. అదిరిపోయే స్టెప్పులేసిన 60 ఏళ్ల బామ్మ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : బుల్లెట్ బండి సాంగా మజాకా.. అదిరిపోయే స్టెప్పులేసిన 60 ఏళ్ల బామ్మ!

Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ వినిపిస్తే చాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ ఏదో తెలియని ఊపు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరి పెళ్లిలో అయినా ప్రధానంగా ఈ సాంగే హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చిన్నపిల్లలు, అమ్మాయిలు ఈ సాంగ్‌కు అదిపోయే స్టెప్పులు వేశారనుకుంటే అంతా కామన్ అనుకుంటారు. కానీ 60 […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 August 2022,2:00 pm

Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ వినిపిస్తే చాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ ఏదో తెలియని ఊపు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరి పెళ్లిలో అయినా ప్రధానంగా ఈ సాంగే హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చిన్నపిల్లలు, అమ్మాయిలు ఈ సాంగ్‌కు అదిపోయే స్టెప్పులు వేశారనుకుంటే అంతా కామన్ అనుకుంటారు. కానీ 60 ఏళ్ల బామ్మ కూడా బుల్లెట్ బండి సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లకు ఒక్కసారి ఏదైనా క‌నెక్ట్ అయితే అవి వైరల్ కావాల్సిందే.

అలా చాలా వీడియోస్‌ను నెటిజన్లు గంటల వ్యవధిలోనే వైరల్ చేసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక‌ మాట‌లో చెప్పాలంటే జ‌నాల్లో ఆ హవా కొంత కాలం ఉండిపోతుంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కాదు ఆఫ్ లైన్ లో ‘బుల్లెట్‌ బండి’ పాట హ‌వా కొన‌సాగుతుంది. సోష‌ల్ మీడ‌యాలో ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీ యువకులు వారి డ్యాన్స్ చేసిన వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. వారికి నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ చీర కొంగు బిగించి ఈ బుల్లెట్ బండి పాట‌కు అదిరిపోయే స్టెప్పులేసింది ఓ వృద్ధురాలు. భ‌ర్త మంచం పై కూర్చొని వుండగా.. సుమారు 60 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు వున్న ఓ వృద్ధురాలు బుల్లెట్ బండి పాట‌కి త‌న‌దైన శైలిలో స్టెప్పులేసి ఆక‌ట్టుకుంది.

OLD WOMAN DANCE Bullet Bandi Song on Video

OLD WOMAN DANCE Bullet Bandi Song on Video

త‌న భ‌ర్త మంచం పై కూర్చొని వుండగా పాట బీట్ కు త‌గ్గ‌ట్టుగా డ్యాన్స్ చేసింది. అయితే, ఆమె భ‌ర్త మాత్రం ఆమె చేస్తున్న డ్యాన్స్ చూస్తూ అలా కూర్చుండి పోయాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు బామ్మ సూప‌ర్ డ్యాన్స్ అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సంగీతాన్ని ఏంజాయ్ చేయడానికి వయస్సుతో సంబంధం లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు.అయితే, ఈ పాటను మోహన భోగరాజు పాడిన విషయం తెలిసిందే. ఆమె పాడి స్వయంగా నటించిన ఈ సాంగ్ సినిమా సాంగ్స్ కంటే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. దీంతో సింగర్ మోహన భోగరాజు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది