Viral Video : వాహ్.. హ్యాపీగా బంతితో ఆటాడుకుంటున్న కోడి పుంజు.. వీడియో !

Authored By mallesh | The Telugu News | Updated on : 6 February 2022, 6:00 am

Viral Video : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ, ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనంలో పిల్లలు ఆటలకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. వర్చువల్ గా స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఫలితంగా పిల్లల్లో శారీరక దృఢత్వం ఏర్పడటం లేదని పలువురు వైద్యులు అంటున్నారు. కాగా, మనుషులే గేమ్స్ కు క్రమంగా దూరమవుతున్న క్రమంలో ఓ కోడి పుంజు బంతితో ఆటాడుతు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.అలా వైరలవుతున్న సదరు వీడియోలో బంతిని కోడి పుంజు బ్యాలెన్స్ చేయడాన్ని చూసి నెటిజన్లు వాహ్.. వెరీనైస్ అని కామెంట్స్ చేస్తున్నారు. యోగ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. వీడియోలో దేశవాళి కోడి పుంజు తన కాళ్లతో బంతిని ఆపడాన్ని మనం చూడొచ్చు.

rooster playing ball video got viral in social media

rooster playing ball video got viral in social media

అలా కోడి పుంజు బంతిని తీసుకెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తిని బంతిని తన్నడంతో అది వేరే చోటుకు ఎగిరి వెళ్లింది. కాగా, ఆ బంతి కోసమో కోడి పుంజు ఎదురు చూసింది.బంతి వెంటే పరుగులు తీస్తూ దానిని ఆపే ప్రయత్నం చక్కగా చేస్తోంది కోడి పుంజు. వీడియోలో ఓ చిన్నారి కూడా కోడి పుంజు వద్దనున్న బాల్ ను తన కాల్ తో తన్నుతుంది. దాంతో కోడి పుంజు ఆ బల్ కోసం పరుగులు తీసి దానిని పట్టుకుంటుంది. అలా చక్కగా కోడి పుంజు బంతితో కాసేపు ఆటాడుకున్న వీడియోను నెటిజన్లు చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.

https://twitter.com/Yoda4ever/status/1489410879460360195

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp