Viral Video : బంజారాహిల్స్ లో దారుణం.. ఎల్ కేజీ పాపపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అత్యాచారం.. వీడియో వైరల్
Viral Video : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ ఏరియాలో ఉన్న ఓ స్కూల్ లో ఓ పాపపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఎల్ కేజీ చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈఘటన పాప తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే స్కూల్ కు వచ్చి ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ను పట్టుకొని చితకబాదారు.
పాప తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు చేరుకొని అతడిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా పాపను ఏం చేశావురా.. అంటూ పాప తల్లిదండ్రులు ఇద్దరూ నిందితుడిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడిని చితకబాదిన తర్వాత వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

school principal driver on lkg girl video viral
Viral Video : నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రయత్నిస్తామని బంజారాహిల్స్ ఎస్ఐ పాప తల్లిదండ్రులకు తెలిపారు. ఎంతటి కఠిన చట్టాలు వస్తున్నా చిన్నారులపై, యువతులపై, మహిళలపై జరిగే దాడులు మాత్రం ఆగడం లేదని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/RameshVaitla/status/1582398323469582336