Viral Video : కోతి చేష్ట‌లు అంటే ఇదేనేమో.. క‌ప్ప‌ను ఓ ఆటాడేసుకున్న కోతులు..

Authored By mallesh | The Telugu News | Updated on : 28 January 2022, 4:30 pm

Viral Video : మ‌న ఇంట్లో ఎవ‌రైనా చిన్న పిల్ల‌లు బాగా అల్ల‌రి చేస్తుంటే.. లేదా ఏదైనా విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటే.. కోతి చేష్ట‌లు అంటూ తిట్టడం చాలా కామ‌న్‌. అయితే నిజానికి కోతి చేష్ట‌లు అంటే అంత విచిత్రంగా ఉంటాయా అంటే చాలా సార్లు కోతులు దీన్ని నిజం చేసి చూపించాయి. కోతుల‌కు వ‌చ్చే ఆలోచ‌న‌లు మ‌రెవ‌రికీ రావేమో. ఒక వ‌స్తువును అయినా లేదంటే ఆహార ప‌దార్థాల‌ను అయినా తిన్న‌గా వాడ‌వు అవి. చిత్ర విచిత్రంగా వాడుతూ వికారం తెప్పిస్తుంటాయి. మొన్న‌టికి మొన్న ఓ కోతి చీర క‌ట్టుకుని రోడ్డు మీదే మురిసిపోతూ బైక్ అద్దంలో చూసుకోవ‌డం చూశాం.

అంత‌కు ముందు ఓ వ్య‌క్తి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి తెగ మారం చేసేసింది. అయితే ఇప్పుడు కూడా ఓ పిల్ల కోతి, త‌ల్లి కోతి క‌లిసి చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా చెక్క‌ర్లు కొడుతోంది. ఇందులో ఓ పిల్ల కోతి, త‌ల్లి కోతి ముందు నుంచి ఓ క‌ప్ప పాక్కుంటూ వెళ్తుంది. అయితే పిల్ల కోతి ఆ క‌ప్ప ఎలా అయితే గెంతుతూ వెళ్తుందో.. అలాగే దాని వెన‌కాల క‌ప్ప గెంతిన‌ట్టే గెంతుకుంటూ వెళ్ల‌డం మ‌నం చూడొచ్చు.

the meaning of monkey antics monkeys playing with the cup

the meaning of monkey antics monkeys playing with the cup

Viral Video :  అటూ ఇటూ ప‌డేస్తూ..

అయితే క‌ప్ప అది గ‌మ‌నించి ఆగిపోతుంది. ఇంత‌లో త‌ల్లి కోతి అక్క‌డ‌కు వ‌చ్చి ఆ క‌ప్ప‌ను చేతుల్లో తీసుకుని అటూ ఇటూ ప‌డేస్తుంది. దీంతో ఆ క‌ప్పకు చుక్క‌లు క‌నిపిస్తాయ‌నుకోండి. ఇదేంట్రా నాయ‌నా.. వీటి చేతుల్లో చిక్కాను అన్న‌ట్టు ఆ క‌ప్ప ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అలా త‌ల్లి, పిల్ల కోతులు క‌లిసి ఆ క‌ప్ప‌ను ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp