Viral Video : పులులను ఆటపట్టిస్తున్న బాతు.. టైగర్స్ భీకర దాడిలో చివరకు. వైరల్ వీడియో..!

Authored By mallesh | The Telugu News | Updated on : 16 January 2022, 7:00 am

Viral Video : సోషల్ మీడియాలో అడవిలో ఉండే క్రూర జంతువులు సింహం, పులికి సంబంధించిన వీడియోలు బోలెడు వైరల్ అవుతుంటాయి. గతంలో టైగర్స్, లయన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అందులో సింహం లేదా పులి ఇతర జంతువులను వేటాడేందుకు ప్రయత్నిస్తుంటాయి. కాగా, ప్రజెంట్ వైరలవుతున్న వీడియోలో పులులను చిన్న బాతు ఆట పట్టిస్తుండటం గమనార్హం. పులులు చివరకు ఏం చేశాయంటే..

‘లాస్ వీడియోస్ ఫ్రమ్ మెక్సికో టు ద వరల్డ్ ’అనే ట్విట్టర్ అకౌంట్ వేదికగా షేర్ చేయబడిన వీడియోలో ఓ కొలనులో మూడు పులులున్నాయి. సదరు వైరల్ వీడియోలో ఈ మూడు పులులు చిన్న కొలనులో ఉండే బాతును వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా ఒక పులి ఒక వైపున ఉండగా మరో రెండు పులులు మరో వైపున ఉండి నీటి కొలనులోపల ఉన్న బాతును చూస్తున్నాయి. ఈ క్రమంలోనే అలా గురి చేసి పులి బాతుపైకి పంజా విసురుతోంది. అయితే, అప్పటికే బాతు నీట మునిగి తప్పించుకుంటున్నది.

tigers attack on duck video viral in internet

tigers attack on duck video viral in internet

Viral Video : అలా చిక్కినట్లే చిక్కి మాయమవుతున్న డక్..

అలా వీడియో చూస్తున్నపుడు డక్.. ఇక దొరికిందని అనిపిస్తున్నది. కానీ, బాతు అలా చిక్కినట్లే చిక్కి మాయమవుతున్నది. అలా ఒక సారి కాదు రెండు సార్లు కాదు.. దాదాపుగా వీడియోలో పులి నాలుగు ఐదు సార్లు భీకరంగా దాడి చేయాలనుకుని దాడి చేస్తూనే ఉన్నది. అయితే, బాతు కూడా చాకచక్యంగా నీటి మునిగి తప్పించుకుంటున్నది. ఈ వీడియో చూసి నెటిజన్లు ‘పులులను ఆటాడిస్తున్న బాతు, బాతు ఇంటెలిజెంట్’ అని పోస్టులు పెడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp