Viral Video : హాయిగా నిద్ర‌పో ఫ్రెండ్… కుక్క‌కి అసిస్టెంట్ గా పిల్లి..

Authored By mallesh | The Telugu News | Published on: April 15, 2022, 9:32 pm

Viral Video: మ‌న‌కు ఫ్రెండ్స్ చాలా కామన్.. మరి జంతువుల మాటేమిటి. ముఖ్యంగా జాతి వైరం ఉన్న జంతువులు ఫ్రెండ్ షిప్ చేయడం చాలా కష్టం. కుక్క- పిల్లి, ఎలుక-పిల్లి, కుక్క- కోతి, ఇవి నిత్య శత్రువులు.. ఒక జీవికి మరో జీవి ఎదురు పడింది అంటే కొట్లాడుకోవడమే కానీ ఫ్రెండ్ షిప్ చేయడం చాలా కష్టం. స్నేహమంటే లింగ బేధం ఉండదు, జాతి బేధం ఉండదు, కులం, మతం ఏదీ చూసుకోదు.ఎవరిమధ్య అయినా స్నేహం చిగురించ వచ్చుకానీ.. శత్రువుల మధ్య స్నేహం ఏర్పడితే దాన్ని వింతగానే చూస్తాం..

ముఖ్యంగా జంతువుల విషయంలో జాతి వైరం ఉన్నవి అసలు ఎదురెదురు పడితే కయ్యానికి కాలు దువ్వుతాయి. అలాంటి వాటి మధ్య ఫ్రెండ్ షిప్ అసలు మనం ఊహించలేం. కానీ ఎవరు ఊహించని విధంగా అలాంటి వాటి మధ్య అప్పుడప్పుడు ఫ్రెండ్ షిప్ ను మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ కుక్క పిల్లి స్నేహం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.సాధారణంగా కుక్క, పిల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. చాలా సార్లు ఆ రెండు ఎదురెదురుగా ఢీ కొన్ని ఘటనలు చాలా మంది చూసే ఉంటారు.

Viral Video Cat as dog assistant

Viral Video Cat as dog assistant

కుక్క ని చూస్తే పిల్లి ఆమడ దూరం పరుగెడుతుంది. కాగా అందుకు భిన్నంగా ఓ వీడియోలో ఓ పిల్లి కుక్క‌ను నిద్ర‌పుచ్చుతోంది. కుక్క స్టాండ్ పై ప‌డుకోగా పిల్లి ప‌క్క‌నే ఉండి ఆ స్ప్రింగ్ స్టాండ్ ని ఊపుతోంది. కుక్క హాయిగా నిద్ర‌పోతోంది. ఇది చూడ్డానికి కుక్క నిద్ర పుచ్చ‌డానికి పిల్లిని అసిస్టెంట్ గా పెట్టుకుందేమో అనిపిస్తుంది. ఈ వీడియో తెగ వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తూ ఫ్రెండ్ షిప్ గ్రేట్ అంటున్నారు.

https://twitter.com/FredSchultz35/status/1514373025046667269

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp