Viral Video : అరేయ్ ఏంట్రా ఇది.. బాతు ఇలా దాడి చేస్తోంది..!

 Authored By mallesh | The Telugu News | Updated on :9 February 2022,1:30 pm

VIRAL VIDEO.. ఈ మ‌ధ్య నెట్టింట్లో కొన్ని జంతువుల వీడియోలు ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే అవి మ‌నం ఊహించ‌న దానికంటే చాలా భిన్నంగా ఉంటున్నాయి. అస‌లు నిజంగా ఇలా జ‌రుగుతాయా అనేంత‌లా షాక్ కు గురి చేస్తున్నాయి ఈ వీడియోలు. కాగా ఇలాంటి వీడియోల‌కు విప‌రీతంగా వ్యూస్ వ‌స్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఓ కోడి గాల్లో ఎగురుతున్న వీడియో ఎంత‌లా వైర‌ల్ అయిందో తెలిసిందే.

Viral Video కారులోకి ఎక్కినా వ‌ద‌ల్లేదు..

అయితే ఇప్పుడు ఓ బాతుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే అదేదో ఘ‌న‌కార్యం చేసింది అనుకోకండి. ఒక అమ్మాయి మీద దాడి చేసింది. విన‌డానికి కొంచెం ఆశ్చ‌ర్యంగా అనిపించినా కూడా ఇదే నిజ‌మండి బాబు. ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు వెంబ‌డి న‌డుచుకుంటూ వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. కాగా ఆమెను ఓ బాతు వెనాకాలే ఎగురు కుంటూ వ‌చ్చి దాడి చేయ‌డం మ‌నం చూడొచ్చు.

viral video duck is attacking on A women

viral video duck is attacking on A women

ఇంత‌లోనే ఓ కారు ఆమెకు ఎద‌రుగా వ‌చ్చి ఆగుతుంది. ఆ అమ్మాయి బాతు నుంచి త‌ప్పించుకునేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది వెంబ‌డిస్తూ దాడి చేస్తుంది. చివ‌ర‌కు ఆమె ఎద‌రుగా ఉన్న కారులోకి ఎక్కినా అది కూడా కారులోకి దూరి దాడి చేస్తుంది. చివ‌ర‌గా ఆమె కోపంగా దాన్ని రోడ్డు మీద‌కు నెట్టేసి డోర్ వేసుకుంటుంది. ఆమె ఆ బాతును ఏమందో తెలియ‌దు గానీ.. అది మాత్రం ప‌గ‌బ‌ట్టిన‌ట్టే అటాక్ చేస్తోంది.

https://twitter.com/guldurbakalim/status/1490642438582673413

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి