Viral Video : కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది మరి.. బాతు దెబ్బకు అల్లాడిపోయిన కుక్కపిల్ల..

Authored By mallesh | The Telugu News | Published on: March 17, 2022, 10:00 am

Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటాయి. మరికొన్ని భయాన్ని పుట్టించేవి కూడా ఉంటాయి. మరి కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలాంటి వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇక ఆ వీడియో వారికి నచ్చిందంటే వెంటనే షేర్ చేసేస్తారు. ఇలాంటి వీడియలో మనకు ప్రతిరోజూ బోలెడు కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడల్లా మన మనసు కాస్త ప్రశాంతమవుతుంది. అన్ని టెన్షన్ల నుంచి కాస్త రిలీఫ్ పొందుతాము. మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది.

వైరల్ అయ్యే వీడియోల్లో జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్న జంతువును ఇరిటేట్ చేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.ఓ నీటి కాలువలో హాయిగా విహరిస్తున్న బాతు వద్దకు వచ్చిన ఓ కుక్క పిల్ల దానిని బాగా విసిగిస్తుంది. అరుస్తూ దానితో గొడవ పడేందుకు ట్రై చేస్తుంది. ఇక ఓపిక నశించిన ఆ బాతు ఒక్క సారిగా కుక్క పిల్లపై దాడి చేసింది. దాన్ని వెంబడించి మరీ చుక్కలు చూపించింది. బాతు నుంచి తప్పించుకునేందుకు ఆ కుక్కపిల్ల అటూ ఇటూ పరుగులు తీసింది.

Viral Video in duck puppy fighting

Viral Video in duck puppy fighting

Viral Video : కుక్క పిల్లకు చుక్కలు చూపించింది

చివరకు ఎలాగో అలా దాని నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరారైంది. ప్రశాంతంగా ఉన్న వారికి కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మందిని ఇది ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కుక్క పిల్లను చూసి తెగ నవ్వుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి..

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp