Home » Exclusive » Viral Video In Kitten For A Drink
Exclusive

Viral Video : డ్రింక్ కోసం ట్రై చేసిన పిల్లి పిల్ల.. కానీ చివరకు…?

Authored By
mallesh
The Telugu News | Published on: March 24, 2022, 8:20 am
Advertisement

Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. పెంపుడు జంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా విషయాల్లో అవి మనకు సాహయంగా ఉంటాయి. కానీ కొన్ని సార్లు అవి చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి.

Advertisement

కొన్ని సార్లు కోపాన్ని తెప్పిస్తాయి. వాటితో కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ జంతువులు మనల్ని అనుకరిస్తాయి కూడా.ఓ ఇంట్లో పిల్లి పిల్ల చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. ఒక గ్లాసులో డ్రింక్ పోసి అందులో ఐస్ క్యూబ్స్ వేసి ఉన్నాయి. ఓ స్ట్రా కూడా ఆ గ్లాస్‌లో ఉంది. ఎప్పటి నుంచి చూస్తుందో తెలియదు కానీ ఇక చివరకు ఆ డ్రింక్ ను తాగాలని ఫిక్స్ అయింది ఆ పిల్లి పిల్ల.

Viral Video in kitten for a drink

Advertisement

Viral Video : స్ట్రా మాత్రం దొరకలేదు..

ఇక రెండు కాళ్లపై నిల్చొని మరో రెండు కాళ్లతో స్ట్రాను పట్టుకునేందుకు ట్రై చేసింది. కానీ స్ట్రా దాని కాళ్లకు చిక్కకుండా అటూ ఇటూ జరుగుతోంది. కానీ పిల్లి పిల్ల మాత్రం ఎలాగైనా స్ట్రాను తీసుకుని డ్రింక్ తాగాలని ఉత్సాహం చూపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ వెరీ ఫన్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసెయ్యండి మరి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి