Viral Video : సింహానికి చెమ‌టలు ప‌ట్టించిన అడ‌వి దున్న‌.. ఏకంగా ఎత్తిప‌డేసింది

Authored By mallesh | The Telugu News | Published on: April 22, 2022, 8:20 am

Viral Video: సింహం.. బోనులో ఉన్నా అది చూసే చూపుకి భ‌య‌ప‌డాల్సిందే. ఎందుకంటే దాని వేట మామూలుగా ఉండ‌దు. ఎలాంటి జంతువైనా భ‌య‌ప‌డాల్సిందే.. లేదంటే దాని పంజా రుచి చూడాల్సిందే. అయితే సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా జంతువుల వీడియోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి. జంతువుల వేట‌… ఫ‌న్నీ చేష్ట‌లు ఇలా ఎన్నో వీడియోల‌ను నెటిజ‌న్లు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సోషల్ మీడియాలో జంతువుల వీడియోల‌ను చూసి టైంపాస్ చేస్తుంటారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే.

వాస్తవానికి చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం సహజమే. ఇక అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే.అయితే ఒక్కోసారి సీన్ రివ‌ర్సై అవుతుంటుంది. పిల్లిని మ‌నం చాలా సార్లు చూసుంటాం. అది మ‌న‌ల్ని చూడ‌గానే ప‌రిగెడుతుంది. కొడ‌తామేమో అని భ‌య‌ప‌డుతుంది. అలాగ‌ని దానిని బంధించాల‌ని చూస్తూ మ‌న‌పైనే అటాక్ చేస్తుంది. అలాగే సింహం అడ‌విలో ఎన్నో జంతువుల‌ను వేటాడుతుంది.

Viral Video in Lion forest buffalo fight

Viral Video in Lion forest buffalo fight

కొన్ని త‌ప్పించుకుంటాయి.. మ‌రికొన్ని బ‌ల‌వుతాయి. ప్రాణాల‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు ఒక్కోసారి జంతువులు తిర‌గ‌బ‌డ‌తాయి. ప్ర‌త్యర్థి ఎవ‌రని కూడా చూడ‌వు. దాన్ని మ‌ట్టిక‌రిపిస్తాయి. అయితే ప్ర‌స్తుతం ఓ అడ‌వి దున్న సింహాన్ని ఏకంగా పైకి లేపి కింద‌ప‌డేసింది. సింహం రెండు దున్న‌ల‌పై అటాక్ చేయ‌గా… త‌న కొమ్ముల‌తో అడ‌విదున్న ఎత్తిప‌డేసింది. ఇంక ప‌రిస్థితి అర్థ‌మైన సింహం అక్క‌డి నుంచి జారుకుంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోది. అడ‌విదున్న ధ్యైర్యాన్ని మీరు కూడా చూసేయండి…

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp