Viral Video : రామచిలుక స్టంట్.. అదిరిపోయిందిగా..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 March 2022,8:30 pm

Viral Video : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కామన్ అయిపోయాయి. అందులో ముఖ్యంగా పిల్లి, కుక్క, పక్షులు ఎక్కువగా ఉంటాయి. కొందరు ఇంటికి సెక్యూరిటీగా కుక్కను పెంచుకుంటుంటే.. మరి కొందరు కాలక్షేపం కోసం పెంచుకుంటున్నారు. ఇక పిల్లులు, పక్షులతో గడుపుతుంటే అసలు టైమ్ తెలియదు. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడతారు.

ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే వారు రోజు మొత్తం పెంపుడు జంతువులతోనే కాలక్షేపం చేస్తారు. దీని వల్ల వారు చలాకిగా ఉంటారు. మరి ఇలాంటి టైంలో వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఇక ఇలాంటి పెంపుడు జంతువులు, పక్షులు ఇంట్లో చేసే అల్లరి పనులు అన్నీ ఇన్నీ కావు. అనుకోకుండా చేస్తాయో.. కావాలనే చేస్తాయో తెలియదు కానీ వాటిని చూస్తుంటే కొన్ని సార్లు నవ్వు పుడుతుంది. మరి కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురువుతుంటాం.

Viral Video in parrot stunt

Viral Video in parrot stunt

Viral Video : మామూలుగా లేదుగా..

ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో రామ చిలుక చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అచ్చం మనిషి లాగే స్టంట్ చేసింది. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క సారిగా జారడం మొదలుపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. నెటిజన్స్ సైతం ఆ రామచిలుకను పొగడకుండా ఉండలేకపోతున్నారు. మరి మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూడండి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి