Viral Video : ఎంత క్యూట్ గా ఉందో.. దీని గురించి తెలుసుకోండి.. షాక్ అవుతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఎంత క్యూట్ గా ఉందో.. దీని గురించి తెలుసుకోండి.. షాక్ అవుతారు

Viral Video : అరేయ్.. ఎవ‌ర్రా మీరు న‌న్ను ఎక్క‌డికి తీసుకొచ్చారు.. వీడెవ‌డో చేతిలో ప‌ట్టుకుని న‌న్నే చూస్తున్నాడు.. అన్న‌ట్లు చూస్తోంది క‌దూ.. దీని పేరు పిగ్మీ మార్మోసెట్ ఇది ప్ర‌పంచంలో అతి చిన్న కోతిగా గుర్తించ‌బ‌డింది. ఇది ద‌క్షిణ ఆమెరికాలోని ప‌శ్చిమ అమెజాన్ బేసిన్ లో స్థానిక వ‌ర్షార‌ణ్యాలలో జీవిస్తుంది. ఇది కేవ‌లం 100 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది.పిగ్మీ మార్మోసెట్ పొడవు తల, శరీరం కలిపి 117 నుండి 152 మిల్లీమీటర్ల వరకు, తల […]

 Authored By mallesh | The Telugu News | Updated on :21 March 2022,7:00 pm

Viral Video : అరేయ్.. ఎవ‌ర్రా మీరు న‌న్ను ఎక్క‌డికి తీసుకొచ్చారు.. వీడెవ‌డో చేతిలో ప‌ట్టుకుని న‌న్నే చూస్తున్నాడు.. అన్న‌ట్లు చూస్తోంది క‌దూ.. దీని పేరు పిగ్మీ మార్మోసెట్ ఇది ప్ర‌పంచంలో అతి చిన్న కోతిగా గుర్తించ‌బ‌డింది. ఇది ద‌క్షిణ ఆమెరికాలోని ప‌శ్చిమ అమెజాన్ బేసిన్ లో స్థానిక వ‌ర్షార‌ణ్యాలలో జీవిస్తుంది. ఇది కేవ‌లం 100 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది.పిగ్మీ మార్మోసెట్ పొడవు తల, శరీరం కలిపి 117 నుండి 152 మిల్లీమీటర్ల వరకు, తల నుండి తోకవరకు 172 నుండి 229 మీల్లీమీటర్ల వరకు ఉంటుంది.

దీని శరీరం పై బొచ్చు రంగు గోధుమరంగుతో కూడిన బంగారు రంగు, బూడిద, నలుపు రంగుకూడిన వీపు, తల, పసుపురంగు, నారింజరంగు, క్రిందిభాగంలో ఊదా రంగు కలిగి ఉంటాయి. దాని తోక నలుపు అలయాలు, దాని ముఖంపై బుగ్గలకు తెలుపు, దాని కళ్ళు మధ్య తెలుపు నిలువుగా చారలు ఉంటాయి. వీటికి పదునైన పంజావలె గోర్లు, 180 డిగ్రీలు తలను త్రిప్పగల సామర్థం ఉంటుంది. దీని దంత స్వరూపంలో ప్రత్యేక ముందరి పళ్ళు చెట్లను ఉలితో చెక్కినట్లు చేస్తాయి. ఇది నాలుగు కాళ్ళతో నడుస్తూ ఐదు మీటర్ల వరకు దుముక గలిగే సామర్థం కలిగి ఉంటుంది.

Viral Video in Pygmy marmoset

Viral Video in Pygmy marmoset

వీటికి సమూహంగా ఉండటం ఇష్టం. ఒంటరిగా ఉండలేవు. పుట్టిన 5 నెలల నుంచే పిల్లల్ని కనేయడానికి సిద్ధంగా ఉంటాయి. 135 రోజుల రర్భధారణ కాలం తరువాత ఒకటి నుండి నాలుగు వరకు పిల్లల్ని కంటాయి. వీటి సగటు జీవితకాలం 25 సంవత్సరాలు ఉంటుంది. చాలా వరకు 11 నుండి 15 ఏళ్ళె జీవిస్తాయి. వీటికి అనేక జంతువులతో ప్రమాదాలు పొంచి ఉంటాయి. పిల్లులు, పాములు, రాబందులు దాడిచేసి వీటిని ఎత్తుకుపోతూ ఉంటాయి. ఇది వింత వింత చేష్ట‌లు చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ట్విట్ట‌ర్ లో వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు లైకులు కొడుతూ.. వావ్ .. ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది