Viral Video : జంతు ప్రేమికుడి మృతి.. ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకున్న వానరం
ప్రధానాంశాలు:
Viral Video : జంతు ప్రేమికుడి మృతి.. ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకున్న వానరం
Viral Video : ఝార్ఖండ్‌లోని దేవగఢ్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నా సింగ్‌కు మూగజీవాలంటే ఎంతో అభిమానం. జంతువులు, కోతులు, కొండముచ్చులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ.. వాటికి ఆహారం అందించేవారు. హనుమంతుడికి పరమ భక్తుడైన మున్నా సింగ్.. జంతువులను తన కుటుంబసభ్యుల్లా భావించేవాడు. మున్నాసింగ్ అనారోగ్యంతో చనిపోగా.. భౌతిక కాయాన్ని ఇంటి బయటపెట్టారు.

Viral Video : జంతు ప్రేమికుడి మృతి.. ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకున్న వానరం
Viral Video ఎంత ప్రేమ..
ఝార్ఖండ్ మాజీ మంత్రి రణధీర్ సింగ్ కూడా మున్నా సింగ్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎక్కడ నుంచో ఒక కొండముచ్చు వచ్చి పాడెపై ఉన్న మున్నా సింగ్ మృతదేహం వద్ద కూర్చుంది. అనంతరం భౌతిక కాయంపై కప్పి ఉన్న కాషాయ రంగు వస్త్రాన్ని పైకి ఎత్తి తదేకంగా ముఖాన్ని చూసింది. ముద్దు పెట్టి, గంటలపాటు కూర్చుంది
ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు ఆ వానరం అంతటితో ఆగకుండా మున్నా సింగ్ అంతిమ యాత్రలోనూ పాల్గొంది. జనంతో కలిసి శ్మశానానికి చేరుకుంది. దీనిని దైవ మహిమగా భావించిన స్థానికులు.. ఆ కొండముచ్చుకు నమస్కారాలు చేశారు.మున్నా సింగ్‌కు చితి పేర్చుతుంటే చాలాసేపు చూస్తూ ఆ మూగజీవి కూర్చుండిపోయింది.
ఆకలి తీర్చిన వ్యక్తిని మరిచిపోని వానరం.. శ్మశానానికి వెళ్లి నుదిటిపై ముద్దు పెట్టి..
ఝార్ఖండ్‌లోని డియోఘర్‌లో జరిగిన ఘటన. మున్నాసింగ్, జంతుప్రేమికుడు, కోతులకు తరచూ ఆహారం పెట్టేవాడు. అతని మరణానంతరం, అంత్యక్రియల సమయంలో ఓ వానరం అతని మృతదేహం వద్దకు వచ్చి, ముద్దు పెట్టి, గంటలపాటు… pic.twitter.com/jkpIiRQjhH
— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2025