Viral video : అరెరే.. ఇది తాబేలులా ఉందే.. ఇదేం వింత చేపరా బాబు.. వీడియో !!
Viral video : సాధారణంగా మనం చాలా రకాల చేపలను చూసే ఉంటాం.. ఒక్కొసారీ వింత వింత చేపలను చూస్తుంటాం. వర్షాకాలంలో విభిన్న మైన చేపలు బయటపడుతుంటాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా చేపలలో కొన్ని వేల రకాల జాతులు ఉంటాయి. సముద్రాల్లో చిత్రవిచిత్రమైన ఆకారాలలో చేపలు కనిపిస్తుంటాయి. కొన్ని జంతువులను పోలి ఉంటాయి. మరికొన్న స్నేక్స్ లా ఉంటాయి.
మరికొన్ని భారీ ఆకారంలో కనువిందు చేస్తుంటాయి. ఇలా ఎక్కడో ఒక్కచోట వింత చేపలను చూస్తుంటాం. ఎక్కువగా ఇలాంటి చేపలు సముద్రాలు, సరస్సులు, నదులు మరియు చెరువులలో కనిపిస్తాయి. చేపలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.అయితే పై వీడియోలో కనిపిస్తున్న చేపను చూడగానే మీకు ఏ అని పిస్తుంది. అరెరే.. ఇది చూడ్డానికి అచ్చం తాబేలు లా ఉందే.. అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కలేసినట్లే. మీరు చూస్తోంది ఓ విభిన్న రకమైన చేప. సాదారణంగా మనం చూసే చేపలకు మొప్పలు ఉంటాయి.

viral video oh no its like a turtle this is a strange fish
Viral video : చూడ్డానికి అచ్చం తాబేలు లా
కానీ ఇక్కడ కనిపిస్తున్న చేపకు లెగ్స్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. సముద్రపు మంచు నీటిపై కదులుతూ కనిపిస్తుంది. పైగా ఇది ఏదో ఎవీగా తినేసి కదలలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఏం చేపో తేల్చుకోలేక కన్ఫ్యూజ్ అవుతూ ఇదే చేపరా బాబు అని ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫన్నీ కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.
First time I saw! A fish can live on land??pic.twitter.com/qK4lWRINLC
— Figen (@TheFigen) March 11, 2022