Viral Video : దొంగలను పరిగెత్తించిన పెట్రోల్ బంక్ వర్కర్.. ఎలాగో తెలిస్తే షాకవుతారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : దొంగలను పరిగెత్తించిన పెట్రోల్ బంక్ వర్కర్.. ఎలాగో తెలిస్తే షాకవుతారు..?

 Authored By mallesh | The Telugu News | Updated on :31 January 2022,3:30 pm

Viral Video : దొంగలు ఎప్పుడు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి చుట్టూ అంతా సవ్యంగానే ఉన్నా మన వస్తువులు, డబ్బులు, బంగారం మాయం అవుతుంటాయి. కొందరు దొంగలు చాలా చలాకీగా ఉంటారు. మూడో కంటికి తెలియకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. దొంగలు పలు రకాలుగా ఉంటారు. కొందరు అర్ధరాత్రులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లల్లో దూరితే మరికొందరు ఉదయం లేదా రాత్రి వాహనాలు, బంగారు గొలుసులు, ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు.

మనదేశంలో అయితే దొంగలు ఎక్కువగా డే టైంలో దాడులు చేయరు. ఒకవేళ చేసినా జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకేటింగ్ లేదా మెడలో గొలుసులు కొట్టేస్తుంటారు. కానీ పబ్లిక్‌గా కారులో దిగి ముగ్గురు నలుగురు దొంగలు దాడి చేసి మరీ దొంగతనం చేసిన గణాంకాలు పెద్దగా రికార్డు కాలేదు. విదేశాల్లో మాత్రం ఇలాంటి దొంగతనాలు కామన్. ఒకేసారి మూకుమ్మడిగా ఏదైనా షాపుపై దాడి చేసి కౌంటర్‌లోని నగదును దోచుకెళ్తుంటారు. అడ్డంవచ్చిన వారిని చితకబాదుతారు.

Viral Video petrol bunk worker who chased the robbers

Viral Video petrol bunk worker who chased the robbers

Viral Video : దొంగలకు తెలివిగా బుద్ధి చెప్పిన వర్కర్

తాజాగా ఓ పెట్రోల్ బంకులో దొంగతనానికి యత్నించిన ముగ్గురు దుండగులపై పెట్రోల్ బంక్ వర్కర్ తెలివిగా ఆలోచించి దొంగతనం జరగకుండా ఆపాడు. నేరుగా పెట్రోల్ బంకులోకి వచ్చిన కారులో ముగ్గురు ఆగంతుకులు దిగుతుండగానే వారికి గుర్తించిన ఉద్యోగి అప్పటికే ఓ కారులో పెట్రోల్ కొడుతుండగా.. ఆ ఇంధనాన్ని నేరుగా వారి మీదకు కొట్టాడు. దీంతో ఎక్కడ ఫైర్ అంటుకుంటే కాలిపోతామేమో అన్న భయంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. దీంతో దొంగతనం జరగకుండా ఆపగలిగాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది