Viral Video : ఈ కుందేలు, తాబేలు దోస్తీని చూడండి.. స్నేహమంటే ఇదే అనేలా లేదా..

Authored By mallesh | The Telugu News | Published on: March 11, 2022, 5:00 pm

Viral Video : జంతువులు ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఏళ్లుగా బద్ద విరోధులుగా ఉన్న జంతువులు ఒక్కో సారి స్నేహం చేస్తూ చూసే వారిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఏళ్ల తరబడి కలివిడిగా ఉండే జంతువులు ఒక్కోసారి పోరాటాలు చేసుకుంటాయి. ఇలా వాటి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పడం చాలా కష్టం. అలాగే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కూడా ఉంది.

ఈ వీడియోలో ఓ కుందేలు, ఓ తాబేలు చాలా చక్కగా స్నేహం చేస్తూ మనకు కనువిందు చేస్తాయి. వీటి ఫ్రెండ్షిప్ ను చూస్తే మనకు వావ్ అని ముచ్చటేస్తోంది. అంతలా అవి ఫ్రెండ్షిప్ చేశాయి. ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు షేర్లు కూడా విపరీతంగా చేస్తున్నారు.వీటి ఫ్రెండ్షిప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు వాటి ఫ్రెండ్షిప్ ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video See rabbit and turtle friendship

Viral Video See rabbit and turtle friendship

Viral Video : సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

తాబేలు కుందేలును తన మీద ఎక్కించుకుని మోసుకుంటూ వెళ్లడం మనం గమనించవచ్చు. ఈ సీన్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం మూవీ గుర్తుకు వస్తోందని కొంత మంది చెబుతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఇక లైకులు కామెంట్లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. మీరు కూడా ఈ వైరల్ వీడియోను వెంటనే చూసేయండి. ఏమని అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరువకండి..

https://twitter.com/Yoda4ever/status/1500644904644587520

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp