Viral Video : వీడి ధైర్యానికి దండ వేసి దండం పెట్టాలి.. పామునే మింగబోయాడుగా..!
ప్రధానాంశాలు:
Viral Video : వీడి ధైర్యానికి దండ వేసి దండం పెట్టాలి.. పామునే మింగబోయాడుగా..!
Viral Video : సాధారణంగా మనం పాముని చూస్తే ఆమడ దూరం వెళతాం. చిన్న పిల్లలు అయితే ఉలిక్కిపడతారు. కాని చిన్న పిల్లాడు ‘విషపూరిత’ పామును మింగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ 13 సెకన్ల వీడియో క్లిప్ నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వీడియోలో, పసుపు రంగు టీ-షర్ట్ ధరించిన ఒక చిన్న పిల్లవాడు నేలపై కూర్చుని, అతని ముందు ఒక పెద్ద పాముని మింగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించాడు.

Viral Video : వీడి ధైర్యానికి దండ వేసి దండం పెట్టాలి.. పామునే మింగబోయాడుగా..!
Viral Video ఏంటా పని..
అయితే బాలుడు అకస్మాత్తుగా ముందుకు వంగి, తన నోటితో పాము పడగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అదృష్టం బాగుండి పాము వెనక్కి తగ్గుతుంది. అయితే ఆ పిల్లవాడు ఈ పని ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు చేస్తాడు. ప్రతిసారీ పాము అతనిని తప్పించుకోవడానికి వెనక్కి తగ్గుతుంది. పాము పిల్లవాడిపై దాడి చేయకపోయినా, ఈ వీడియో గురించి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను ‘జెజాక్ సి ఈడెన్ రియల్’ అనే ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేయగా, దానికి కామెంట్‌గా . పాము ప్రమాదంలో ఉందని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, వీడియో చూసిన తర్వాత, చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా పిల్లాడికి భూమి మీద నూకలు ఉన్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు తర్వాత ఏం జరిగిందో చెప్పలేదని అంటున్నారు.