Viral Video : ఇదేం రోమాన్స్ రా బాబు.. బైక్ పై వెళ్తూ కూడా ఆ ప‌నేనా.. వీడియో వైర‌ల్..!

Authored By Breaking News | The Telugu News | Published on: December 31, 2022, 10:40 am

Viral Video : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఏపీ అధికార పార్టీ వైసిపి తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని రకాలుగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకపక్క అభివృద్ధి మరోపక్క చండాలమైన పనులు కూడా విశాఖలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. విషయంలోకి వెళ్తే విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని ప్రియుడి రెచ్చిపోయాడు. ఒకపక్క డ్రైవింగ్ చేస్తూనే మరోపక్క లిప్ కిస్ లుతో చెలరేగిపోతు

రోడ్డుపై బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం జరిగింది. ఆ జంట తాము నడిరోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తారు అన్న భయం కూడా లేకుండా… ఎదురుగా వచ్చే వాహనాలు తమకేమీ సంబంధం లేదు అన్నట్టు కామంతో కళ్ళు మూసుకుపోయి మరి ప్రవర్తించారు. పైగా ఈ సమయంలో డ్రైవ్ చేస్తున్న అబ్బాయికి హెల్మెట్ కూడా లేకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. పైగా ఇద్దరు కూడా కాలేజీ యూనిఫామ్ లో ఉన్నారు. అయినా కూడా ఎవరి భయం లేకుండా నడిరోడ్డుపై దోచుకుంటూ వెళ్లిపోయారు.

Visakhapatnam Bike Lovers Viral Video

Visakhapatnam Bike Lovers Viral Video

అయితే ఆ బైకు వెనకాల కారులో కొంతమంది ప్రశ్నించగా… అవేమీ పట్టించుకోకుండా ఆ జంట ఒకపక్క ముద్దుల వ్యవహారం నడుపుతూ బైక్ తోలుకుంటూ వెళ్లిపోయారు. విశాఖ జంట లిప్ కిస్ బైక్ రైడింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ వీడియో ఏపీ రవాణా శాఖ అధికారులు దృష్టి దాక వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆకతాయిగా బైక్ రైడ్ చేయడం మాత్రమే కాదు హెల్మెట్ లేకుండా ముందు అమ్మాయిని కూర్చోబెట్టుకుని .. బైకు తోలడంతో వాళ్లపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

https://youtube.com/watch?v=QnZ3o3n6xD0&si=EnSIkaIECMiOmarE

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp