Petrol : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల పెట్రోల్ బంకులలో అక్రమాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం తెలిసిందే. చాలా చోట్ల నాసిరకం పెట్రోలు అమ్మేస్తున్నారు. అంత మాత్రమే కాదు తప్పుడు మీటర్ లకు కనెక్షన్ ఇచ్చి.. భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వాహనదారుల నుండి తీసుకొని తక్కువ పెట్రోల్ వచ్చేలా ముందే రీడింగ్స్ సెట్ చేసి భారీగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వాహనా దారుల నుండి డబ్బులు దోచేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ బంకులలో దోపిడీ ఈమధ్య ఎక్కువైపోయింది. ఈ క్రమంలో తనిఖీలు చేసిన సమయంలో దొరికిన వాళ్ళు పెట్రోల్ బంక్ సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ రకంగానే మంచిర్యాల – హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ బదులుగా నీరు వస్తుండటంతో వినియోగదారులు బంకు సిబ్బంది మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా పెట్రోల్ బదులు నీళ్లు పోస్తూ ఉండటంతో అడ్డంగా బుక్ కావటంతో ఈ వార్త సంచలనంగా మారింది.
ఇదే సమయంలో పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కూడా జనాలు మండిపడుతున్నారు. ఈ రకంగా వాహనాలలో నీళ్లు పోయటం వలన ఇంజన్లో పాడైపోయి మొత్తానికి పనికిరాకుండా పోతుందని.. లాభాల కోసం జనాల జీవితాలతో ఇలా ఆడకూడదని విమర్శిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.