Viral Video : డ్యాన్స్ తో దుమ్ములేపుతున్న యువ జంట‌.. ఎవ్వ‌రూ త‌గ్గ‌ట్లేదుగా…

 Authored By mallesh | The Telugu News | Updated on :3 May 2022,2:00 pm

Viral Video: ఒక‌ప్పుడు పెళ్లిలో బంధువులు, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేసేవారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత‌గా డ్యాన్స్ చేయ‌మ‌ని ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినా సిగ్గుప‌డేవారు. ఇప్పుడు అలా కాదు అంద‌రికంటే ముందే పెళ్లి కూతురు మండ‌పానికి డ్యాన్స్ చేసుకుంటూ వ‌స్తోంది. మండ‌పంలో పెళ్లి కొడుకు ముందు డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తోంది. ఒక‌ప్పుడు డ్యాన్స్ చేయాలంటే అమ్మాయిలు సిగ్గుప‌డేవారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో త‌మ టాలెంట్ ని చూపిస్తున్నారు.

బోనాల పండుగ‌లో, శోభాయాత్ర‌లో ఇత‌ర పండుగ‌ల‌లో మాస్ డ్యాన్స్ లు చేస్తూ ఇర‌గ‌దీస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అద‌ర‌గొడుతున్నారు. పెళ్లి అన‌గానే ఇంటిల్లిపాది.. బంధువులు.. ఫ్రెండ్స్ డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. ఫంక్ష‌న్ల‌లో.. పండ‌గ‌ల‌లో డ్యాన్స్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.ఏ సాంగ్ ట్రెండింగ్లో ఉన్నా వ‌ద‌ల‌కుండా డ్యాన్స్ చేసి వైర‌ల్ అవుతున్నారు. పెళ్లికూతురు పెళ్లికొడుకు పోటీ ప‌డి మ‌రీ డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత‌మంది ఉన్నా జంకులేకుండా త‌మ స్టెప్ప‌లతో కుమ్మేస్తున్నారు. పెళ్లిలో వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వేల‌ల్లో ఉన్నాయి.

young couple dancing video viral

young couple dancing video viral

బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. అంటూ ఆక‌ట్టుకుంటున్నారు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ పిచ్చెక్కిస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ ఇంట్లో వ‌ధూవ‌రులు.. ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్.. చిన్న‌పిల్ల‌లు ఇలా అంద‌రూ డ్యాన్స్ ఇర‌గ‌దీసిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మూడు ల‌క్ష‌ల్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఈ వీడియోలో వ‌ధూవ‌రుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రూ స్టెప్పులేస్తూ దుమ్ములేపారు. ఎవ‌ర్నీ చూసినా త‌గ్గేదేలా.. అన్న‌ట్లు క‌నిపించారు. మీరు కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి….

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి