young man saves life of a child video viral
Viral Video : ఈ భూమ్మీద నూకలు ఉంటే ఎన్ని ప్రమాదాలు జరిగినా బతికి బట్టకడతామని చెబుతుంటారు పెద్దలు. అవును.. నిజమే. ఒకవేళ అదే నూకలు లేకపోతే.. ఇంట్లో కూర్చున్నా కూడా మృత్యువు దరిచేరుతుందట. అదే జీవితం అంటే.సాధారణంగా రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు వేగంగా వెళ్లి వేరే వాహనాలను ఢీకొని యాక్సిడెంట్లు అవడం చూస్తుంటాం. రోడ్ల మీద నడుస్తూ వెళ్లే వాళ్లను ఢీకొట్టే వాహనాలను కూడా చూస్తుంటాం.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు, యువతి.. రోడ్డు దాటేందుకు నిలబడ్డారు. ఆ రోడ్డు మీద వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. దీంతో కాసేపు అలాగే నిలబడ్డారు. ఇంతలో రోడ్డుకు అవతలి వైపు నుంచి ఓ చిన్నారి రోడ్డు మీదకు పరిగెత్తుకురాబోయింది.అప్పుడే వేగంగా ఓ కారు ఆ రోడ్డు మీద వస్తోంది. అయితే.. యువకుడు ఆ చిన్నారిని గమనించడు. ఆ చిన్నారి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ రావడాన్ని గమనించిన ఆ యువతి వెంటనే ఆ యువకుడిని అలర్ట్ చేస్తుంది.
young man saves life of a child video viral
దీంతో వెంటనే ఆ యువకుడు రోడ్డుకు అడ్డంగా పరిగెత్తుకెళ్లి ఆ చిన్నారిని రక్షిస్తాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు.. నెటిజన్లు ఆ వీడియో చూసి ఆ చిన్నారిని కాపాడిని యువకుడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.