Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?
Viral Video : ఈ భూమ్మీద నూకలు ఉంటే ఎన్ని ప్రమాదాలు జరిగినా బతికి బట్టకడతామని చెబుతుంటారు పెద్దలు. అవును.. నిజమే. ఒకవేళ అదే నూకలు లేకపోతే.. ఇంట్లో కూర్చున్నా కూడా మృత్యువు దరిచేరుతుందట. అదే జీవితం అంటే.సాధారణంగా రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు వేగంగా వెళ్లి వేరే వాహనాలను ఢీకొని యాక్సిడెంట్లు అవడం చూస్తుంటాం. రోడ్ల మీద నడుస్తూ వెళ్లే వాళ్లను ఢీకొట్టే వాహనాలను కూడా చూస్తుంటాం.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు, యువతి.. రోడ్డు దాటేందుకు నిలబడ్డారు. ఆ రోడ్డు మీద వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. దీంతో కాసేపు అలాగే నిలబడ్డారు. ఇంతలో రోడ్డుకు అవతలి వైపు నుంచి ఓ చిన్నారి రోడ్డు మీదకు పరిగెత్తుకురాబోయింది.అప్పుడే వేగంగా ఓ కారు ఆ రోడ్డు మీద వస్తోంది. అయితే.. యువకుడు ఆ చిన్నారిని గమనించడు. ఆ చిన్నారి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ రావడాన్ని గమనించిన ఆ యువతి వెంటనే ఆ యువకుడిని అలర్ట్ చేస్తుంది.

young man saves life of a child video viral
Viral Video : ఊపిరి బిగపట్టుకొని చూసే వీడియో ఇది
దీంతో వెంటనే ఆ యువకుడు రోడ్డుకు అడ్డంగా పరిగెత్తుకెళ్లి ఆ చిన్నారిని రక్షిస్తాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు.. నెటిజన్లు ఆ వీడియో చూసి ఆ చిన్నారిని కాపాడిని యువకుడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
O bir kahraman ???????????????????????? pic.twitter.com/2CzKfU8A6V
— yok artık (@yokartik_ya) February 20, 2022