Viral Video : క్లాస్‌రూంలో అందరిముందు అదిరిపోయే స్టెప్పులు వేసిన యువతీ… వీడియో..!

Authored By mallesh | The Telugu News | Published on: September 17, 2022, 2:00 pm

Viral Video : చదువు బాగా వస్తే ఉన్న మతి పోయిందనే సామేత వినే ఉంటారు. కొందరు స్టూడెంట్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించారో మరిచిపోతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ సంస్కారం కోల్పోతున్నారు. విజ్ఞత మరిచి చదువు రాని వారి కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తరగతి గదిలో టీచర్లు లేని సమయం చూసి ఓ విద్యార్థిని బోర్డ్ వద్ద స్టేజిపై ఓ హిందీ ఐటం సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తరగతిలో విద్యార్థులు శృతి మించి ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న అమ్మాయి, అబ్బాయిలు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం,

హగ్ చేసుకోవడం వంటి వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. మరోచోట అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఇలాంటి వీడియోలు రోజుకు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ కూడా వారి పిల్లలు చేస్తున్న పనికి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీచర్స్ డే సందర్భంగా ఎవరైనా ఉపాధ్యాయులకు బహుమతులు అందజేస్తారు. లేదా టీచర్స్ డే సందర్భాన్ని ప్రతిబింబించేలా పాటలు పాడుతారు. అంతేకానీ ఇలా ఐటం సాంగ్‌కు స్టెప్పులేస్తారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.

young woman Dance video viral on instagram

young woman Dance video viral on instagram

Viral Video : డిసిప్లేన్ మరిచి క్లాస్ రూంలో కుప్పిగంతులు

అగ్నిపత్ మూవీలో చిక్కిని చమ్మేలీ పాటకు విద్యార్థిని ఒళ్లు మరిచి గంతులు వేస్తుండగా.. తోటి విద్యార్థులు దీనిని వీడియోలు తీస్తున్నారు. కాసేపు ఆమెను కత్రినా కైఫ్ పూనిందా అన్న రేంజ్‌లో బాడీని షేక్ చేస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో తోటి విద్యార్థులు అది తరగతి గది అని మరిచి అరుపులు, విజిల్స్ వేస్తూ రెచ్చిపోయారు. థియేటర్ వల్లే కాసేపు భారీ శబ్దాలు వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. కొందరు అమ్మాయి డ్యాన్స్‌ను పొగిడితే మరికొందరు ఆమెపై మండిపడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp