Viral Video : క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో యువతి పెళ్లి కూతురు డ్రెస్సుల్లో డ్యాన్స్ .. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :6 June 2022,7:40 am

Viral Video : అమ్మాయిలు త‌మ డ్యాన్స్ తో మ‌తిపోగొడుతున్నారు. సోష‌ల్ మీడియాలో డైలీ కొన్ని వేల డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో చాలా వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొడుతున్నారు. డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉండే అమ్మాయిలు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ టాలెంట్ చూపిస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, శారీల‌ల్లో డ్యాన్స్ చేస్తూ సినిమా హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోవ‌డంలేదు. త‌మ టాలెంట్ తో అంద‌రినీ ఆక‌ట్టుక‌ని ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. అంతే కాకుండా బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు.

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లిలో డ్యాన్స్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు డ్యాన్స్ పెళ్లికే హైలైట్ అవుతుంది. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుండ‌టంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఇదే ట్రెండ్ చాలా మంది ఫాలో అవుతున్నారు. పెళ్లి స్టార్ట్ అయింది మొద‌లు సంగీత్, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఏకంగా మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. అందంగా ఫొటోల‌కు ఫోజులిస్తూ జ్ఞాప‌కాల‌ను బందించుకుంటున్నారు.

Young woman dancing video in bridal dresses

Young woman dancing video in bridal dresses

అలాగే పెళ్లికిముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్, డ్యాన్స్ తో ర‌చ్చ చేస్తున్నారు. అలాగే పెళ్లికూతురు గెట‌ప్ లో డ్యాన్స్ వీడియో షూట్ చేయించుకుని మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి పెళ్లికూతురు గెట‌ప్లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. సాంప్ర‌దాయంగా చీర‌క‌ట్టులో ఒంటి నిండా బంగారు ఆభ‌ర‌ణాలతో ముస్తాబై విజ‌య్ బీస్ట్ సినిమాలోని ట్రెండింగ్ సాంగ్ అర‌బిక్ కుత్తుకి క్యూట్ గా ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో నెటిజ‌న్లు నైస్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ తో లైక్స్ కొడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి