Viral Video : డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్న ఎయిర్ హోస్టెస్.. ఫిదా అవ‌తున్న నెటిజ‌న్లు

Authored By mallesh | The Telugu News | Published on: May 2, 2022, 2:00 pm

Viral Video : సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతున్నారు. ఒక‌ప్పుడు అమ్మాయిలు టాలెంట్ ఉండి కూడా స‌రైన వేదిక‌లు లేక‌పోవ‌డంతో నిరాశ‌కులోన‌య్యేవారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల‌లో డ్యాన్స్, కామెడీ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. కొంచెం కొత్త‌గా ఉంటే చాలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఎంతో మంది కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించారు.

సినిమాలో హిట్ అవ్వ‌ని సాంగ్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా తెగ పాపుల‌ర్ అయ్యాయి.క‌చ్చా బాద‌మ్.. సాంగ్ తెలుసు క‌దా.. ఎంత పాపుల‌ర్ అయిందో.. ఒక వేరుశ‌న‌గ ప‌ల్లీలు అమ్ముకునే వ్య‌క్తి తాను స‌ర‌దాగా పాడుకున్న పాట సోష‌ల్ మీడియా వేదిక‌గా దేశమంతా మార్మోగింది. ఎంతో మంది ఈ పాట‌కు ర‌క‌ర‌కాలుగా స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నారు. దీంతో ఏకంగా ఆ వ్య‌క్తిని స్టార్ ని చేసింది ఈ సాంగ్. ఓ మ్యూజిక్ కంపెనీ అత‌నితో సాంగ్ కూడా కంపోజ్ చేసింది. ఇంకా ఎంతో మంది రియాల్టీ షోలు, టీవి షోల్లో, సినిమాల్లో చాన్స్ లు కొట్టేశారు.

young women Dance in video viral

young women Dance in video viral

టాలెంట్ ఉంటే చాన్స్ లు వ‌దులుకోవ‌ద్ద‌ని నిరూపించారు చాలా మంది.ప్ర‌స్తుతం ఓ ఎయిర్ హెస్ట్ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఓ పాట మ్యూజిక్ కు యూనిఫామ్ లో డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టింది. త‌న డ్యాన్స్ కి అందం అభినయం తోడ‌వ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. గ‌తంలో కూడా ఈ ఎయిర్ హెస్టెస్ చాలా సార్లు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియో వైర‌ల్ కాగా నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి….

 

View this post on Instagram

 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp