rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?

Rajashyamala Yagam : మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు యాగాలకు విడదీయలేని బంధం ఉంది. అందులోనూ రాజశ్యామల యాగానికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతారు. ఆ యాగం చేస్తే అధికారం దక్కుతుందనే ప్రచారం ఉంది. గతంలో రాజులు కూడా ఈ యాగం చేసి రాజ్యాలను దక్కించుకున్నారు. ఇక ఇప్పటి కాలంలో రాజకీయ నేతలు ఈ యాగాలను చేస్తున్నారు. అయితే తెలంగాణలో కూడా కేసీఆర్ పలుమార్లు ఈ యాగాన్ని చేసి పదేండ్లు సీఎంగా పరిపాలించారు. అటు ఏపీలో కూడా ఈ యాగానికి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. 2019లో జగన్ ను ఇదే సీఎం చేసిందని అంటుంటారు.

Rajashyamala Yagam : జగన్ సీఎం హోదాలో..

ఆ ఎన్నికల సమయంలో జగన్ పేరు మీద విశాఖలోని శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహించారు. దాంతో అప్పుడు జగన్ సీఎం అయ్యారు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి ఏడాది శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. అష్టలక్ష్మీ యాగంతో పాటు ఈ యాగం నిర్వహిస్తున్నారు. అయితే చివరి రోజున యాగంలో జగన్ సీఎం హోదాలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా అటు దేవాదాఖ శాఖ కూడా గతేడాది నిర్విరామంగా ఈ యాగాన్ని పలు ఆలయాల్లో నిర్వహించింది. దానికి పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు. ఇక ఈ నెల మొదటి వారంలో కూడా శారదా పీఠం నిర్వహించింది.

ఈ నెల మొదటి వారంలో శారదా పీఠంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జగన్ మరోసారి సీఎం కావాలని ఈ యాగం నిర్వహించినట్టు తెలిపారు. అటు ఆ యాగంతో పాటు తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేడ పండితులతో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ విషయం కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే సరిగ్గా పోలింగ్ పూర్తి అయిన రెండవ రోజున ఈ యాగం కూడా పూర్తి అయింది. దాంతో వేద పండితులు జగన్ నివాసానికి వెళ్లి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

rajashyamala yagam 41 రోజులుగా రాజశ్యామల యాగం మరోసారి జగనే సీఎం

rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?

ఈ యాగంతో జగన్ మరోసారి సీఎం అవడానికి దోహదపడుతుందని తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు బాగుంటారని వేదపండితులు చెప్పుకొచ్చారు. మరి ఈ రాజశ్యామల యాగం మరోసారి జగన్ ను సీఎం చేస్తుందా లేదా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది