ABN Radhakrishna : అయ్యయ్యో… ఏబీఎన్ రాధాకృష్ణకి పాపం కోపమోచ్చిందే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ABN Radhakrishna : అయ్యయ్యో… ఏబీఎన్ రాధాకృష్ణకి పాపం కోపమోచ్చిందే !

 Authored By kranthi | The Telugu News | Updated on :11 June 2023,6:00 pm

ABN Radhakrishna : ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ఎందుకో మరి.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తెగ ఫైర్ అవుతున్నారు. అసలు.. ఆయనకు, ఈయనకు సంబంధం ఏంటి. ఆయన మీడియా పర్సన్. సోము వీర్రాజు రాజకీయనేత. కానీ.. రాజకీయ నేతపై మీడియా అధినేత ఫైర్ అవడం ఏంటి అనుకుంటున్నారా? ఎబీఎన్ ఆర్కేకు ఎవరంటే ఇష్టమో తెలుసు కదా. చంద్రబాబును ఆరాధిస్తారు. అందుకే.. ఏబీఎన్ రాధాకృష్ణ మీడియాను పచ్చ మీడియా అని అభివర్ణిస్తుంటారు. చంద్రబాబును రాధాకృష్ణ అభిమానిస్తారు. టీడీపీ అంటే సోము వీర్రాజు ఒంటి కాలిపై లేస్తారు. అందుకే.. సోము వీర్రాజుపై రాధాకృష్ణ సీరియస్ అయ్యారు. అదన్నమాట విషయం.

టీడీపీ ఈ మధ్య బీజేపీతో పొత్తు కోసం మంతనాలు జరుపుతున్న విషయం తెలుసు కదా. చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ.. బీజేపీ హైకమాండ్ తో మంతనాలు జరిపారు. కానీ.. ఏం జరిగింది. బీజేపీకి టీడీపీతో పొత్తు అంటే అస్సలు ఎవ్వరికీ ఇష్టం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండటం వల్లే ఆయన గెలిచారు. కానీ.. ఆ విషయం మరిచిపోయి బీజేపీతో కటీఫ్ అనేసరికి.. బీజేపీ కూడా టీడీపీని వదిలేసింది. అప్పటి నుంచి బీజేపీని పట్టించుకోవడం లేదు.

abn radhakrishna fires on somu veerraju

abn radhakrishna fires on somu veerraju

ABN Radhakrishna : శ్రీకాళహస్తి బీజేపీ సభపై ఆర్కే విసుర్లు

తాజాగా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసభకు బీజేపీ జాతీయ నేతలు వచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వచ్చారు. దీనిపై ఆర్కే మండిపడ్డారు. సోము వీర్రాజును టార్గెట్ చేసిన రాధాకృష్ణ రచ్చ రచ్చ చేశారు. అసలు వీర్రాజును టార్గెట్ చేసి ఆయన గురించే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోము వీర్రాజును కావాలని పక్కన పెట్టి రాధాకృష్ణ తన పంతం నెగ్గించుకున్నారు. శ్రీకాళహస్తికి సంబంధించిన బహిరంగ సభ వార్తలు, ఫోటోలను చూస్తే అదే అనిపిస్తోంది. ఒక జాతీయ పార్టీ అది కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. అటువంటి పార్టీకి చెందిన ఏపీ అధ్యక్షుడిని కావాలని ఆర్కే పక్కన పెట్టడం తన వ్యతిరేకతను పెంపొందించడమే కదా.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది