ABN Radhakrishna : పవన్ కు తీవ్ర నష్టం కలిగిస్తున్న ABN రాధాకృష్ణ…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ABN Radhakrishna : పవన్ కు తీవ్ర నష్టం కలిగిస్తున్న ABN రాధాకృష్ణ…!!

ABN Radhakrishna : ఈ దేశంలో 97% జర్నలిజం చచ్చిపోయింది అని చెప్పాలి. అయితే మోడీకి లేదా రాహుల్ గాంధీ కి సపోర్ట్ గా మీడియా చానల్స్ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి లేదా చంద్రబాబుకి సపోర్ట్ గా ఉండే మెంటాలిటీస్ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణ ఆరోపణ చేశారు ఎలాంటి రకమైన ఇబ్బంది కలగజేస్తున్నారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. జనసేన మీద ఆంధ్రజ్యోతి […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,2:00 pm

ABN Radhakrishna : ఈ దేశంలో 97% జర్నలిజం చచ్చిపోయింది అని చెప్పాలి. అయితే మోడీకి లేదా రాహుల్ గాంధీ కి సపోర్ట్ గా మీడియా చానల్స్ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి లేదా చంద్రబాబుకి సపోర్ట్ గా ఉండే మెంటాలిటీస్ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణ ఆరోపణ చేశారు ఎలాంటి రకమైన ఇబ్బంది కలగజేస్తున్నారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. జనసేన మీద ఆంధ్రజ్యోతి తాజాగా ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక ఆ కథనం ప్రచురించడానికి 24 గంటలు ముందుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు లో ఉన్నటువంటి తమ రెండు పార్టీల అభ్యర్థుల ఖరారు గురించి హైదరాబాదులో కలిశారు. అయితే అలా కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటలపాటు దీని గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. ఏ ఏ ప్రాంతాల్లో జనసేనకు సీట్లు ఇవ్వాలి, గెలిచే అటువంటి సత్తా ఆ పార్టీకి ఎక్కడ ఉంది. అలాగే ఏ ఏ ప్రాంతాలలో టిడిపి పార్టీకి పట్టు ఉంది కచ్చితంగా గెలిస్తే పరిస్థితి ఉంది. అలాగే ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు జనసేన గెలిచా అవకాశం ఉంటుంది.

అలా 175 నియోజకవర్గాలలో 175 గెలిచే విషయాల గురించి చాలాసేపు చర్చించుకోవడం జరిగింది. అయితే వారు ఏం మాట్లాడుకున్నారు అనేది ఏమి బయటకు రాకముందే ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని బయటకు తెచ్చింది. ఏం ప్రచురించింది అనేదానికంటే ముందు రెండు వర్గాలుగా ఆంధ్రప్రదేశ్ యొక్క జర్నలిజం చీలిపోయిందని మన అందరికి తెలిసిందే. ఒకటి జగన్ మోహన్ రెడ్డి వైపు మరియు ఇంకొకటి చంద్రబాబు నాయుడు వైపు. జగన్ వైపు టీవీ9 కానీ ఎన్టీవీ గానీ సాక్షిగాని కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు వైపు టీవీ5 గాని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైపు మంచి స్పందన ఉంది. సాక్షి అనేది సొంత పత్రిక కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా నడిపిస్తే అలా నడిచేటువంటి ఒక ప్రణాళికను ముందే రూపొందించుకొని జగన్ ఎలా చెబితే అలా పని చేస్తూ ఉంటుంది. ఇక ఎన్ టివి టివి9 విషయానికి వస్తే అధికారంలో ఉన్న వారికి ఈ టీవీలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అధికారంలోకి ఎవరు వస్తే వారిని సపోర్ట్ చేసి విధంగా ఐడియాలజీ ఉంటుంది. అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటివారికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ నెగటివ్ ఏంటంటే.. అదే ఇప్పుడు టిడిపి జనసేన పొత్తుకు తలకాయ నొప్పిగా మారుతుంది. అది ఏంటంటే… వీరికి సొంత కవిత్వం ఎక్కువ అని చెప్పాలి.

ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలవాలని రాత్రి పగలు పనిచేసే ఏబీఎన్ రాధాకృష్ణ గెలవడానికి ఏం చేయాలో అది చంద్రబాబుకు చెప్పకుండానే స్వతంత్రంగా ఈయన పత్రికలో వేయడం, తన ఐడియాలజీ చాలా అద్భుతం అంటూ చెప్పుకుంటూ వచ్చే దశలో వారికి వారికి మధ్య తలనొప్పులు తీసుకొస్తున్నారు.. ఇక మొన్న కూడా అదే జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకోకుండానే జనసేనకు 20 సీట్లు మాత్రమే రాబోతున్నాయని కథనం ప్రచూరించారు. అయితే వారు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ప్రచురించిన దానికి అసలు అధికారి ప్రకటన లేకుండానే ప్రచురించిన దానికి చాలా తేడా ఉంటుందని చెప్పాలి. ఇక ఇలా చేయడం జనసేన పార్టీ అభ్యర్థులకు బాడ్ నెగటివ్ ఇంప్రెషన్ పడేలా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏబీఎన్ ఛానల్ వారు ఇలా చేయడం పవన్ కళ్యాణ్ కు కచ్చితంగా నష్టం కలిగిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఇన్నాళ్లు కూడా దాదాపు 60 సీట్లు కోరాలి అని చూస్తుంది. అదేవిధంగా జనసేన కు సపోర్ట్ చేసేవాళ్లు జనసేనకు అండగా నిలబడిన సామాజిక వర్గం కూడా ఇదేవిధంగా ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఏబీఎన్ 20 సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పడం అది కూడా అధికారిక ప్రకటన రాకముందే చెప్పడం జనసేన పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది