Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ ..నెక్స్ట్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ ..నెక్స్ట్ ?

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2025,4:06 pm

ప్రధానాంశాలు:

  •  Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ ..నెక్స్ట్ ?

Rajini : మాజీ మంత్రి విడదల రజినికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె మరిది విడదల గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద ఉన్న శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనపై నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో రజినిని ప్రధాన నిందితురాలిగా (ఏ1) చేర్చిన ఏసీబీ, గోపినాథ్‌ను (ఏ3), ఓ ఐపీఎస్ అధికారిని (ఏ2), అలాగే ఆమె పీఏ రామకృష్ణను (ఏ4) చేర్చారు.

Rajini మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ నెక్స్ట్

Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ ..నెక్స్ట్ ?

Rajini  మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్ ఇచ్చిన ACB

కేవలం ఒకటే కాదు, గత కొన్ని నెలలుగా మాజీ మంత్రిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. పసుమర్రు గ్రామంలోని జగనన్న కాలనీ స్థలాల సేకరణలో రైతుల నుంచి కమీషన్ పేరిట డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో మరో కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలపై తీరైన స్పందన రాకపోయినా, ఆరోపణల మధ్య రజినీ డబ్బులు తిరిగి ఇచ్చేశారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఐటీడీపీ నేత పిల్లికోటి అనే వ్యక్తి, తనను వేధించారంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రజినిపై పెట్టడం చర్చనీయాంశమైంది.

ఈ కేసుల నేపథ్యంలో ఇది కేవలం రాజకీయ కక్షేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ నేతలు ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన పేరుతో విపక్ష నేతలపై అకారణంగా కేసులు పెట్టడం ద్వారా వారిని వేధించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. పాలక పక్షం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ ప్రేరణతోనే ఈ చర్యలు తీసుకుంటోందని విమర్శిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది