Actor Raja Ravindra : జగన్ ముందు షర్మిల ఆటలు సాగవు .. నటుడు రాజా రవీంద్ర కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Actor Raja Ravindra : జగన్ ముందు షర్మిల ఆటలు సాగవు .. నటుడు రాజా రవీంద్ర కామెంట్స్..!
Actor Raja Ravindra : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు హోరాహోరి పోటీ నెలకొంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కూటమిగా ఏర్పడి తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ లోకి చేరి సెన్సేషనల్ గా మారారు. తన అన్న జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వై.ఎస్.షర్మిల గురించి పెద్ద హాట్ టాపిక్ గా మారారు. తన అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లోకి చేరటంపై చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉండగా సినీ నటుడు రాజా రవీంద్ర ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ వస్తారు అనుకున్నా కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి సింగిల్ హ్యాండ్ మీద పార్టీని తీసుకువచ్చారు అని అన్నారు.
ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై కూడా రాజా రవీంద్ర కామెంట్స్ చేశారు. జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ పథకాల వలన లబ్ధి పొందిన వారు ఓట్లు వేస్తే ఖచ్చితంగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని అన్నారు. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే పోరు చేస్తారని, ఎవరితో పొత్తు పెట్టుకోరని, సింగిల్గానే పోరాటం చేస్తారని అన్నారు. ఇక ఏ పార్టీలో లేనివిధంగా వైసీపీలో ఇన్చార్జిలను మారుస్తూ వస్తున్నారు. దీనివలన వ్యతిరేకత వచ్చిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేయగలరని అన్నారు. అయితే ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్లిన ఓడిపోతారని ఎన్టీ రామారావు గారు లాంటి వారినే ఓడించారు.
వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం అని రాజా రవీంద్ర అన్నారు. దానికి కారణం ఏంటో కూడా చెప్పారు. జగన్ 18 నెలలు జైల్లో పెడితే జగన్ ఏమాత్రం కృంగిపోలేదని, రెట్టింపు ఉత్సాహంతో బయటికి వచ్చి పాలిటిక్స్ లో రాణించారు. అధికారంలోకి రావటం అనేది పెద్ద విషయం. దాని వెనక ఆయన కృషి పట్టుదల ఉన్నాయి. అందుకే వై.యస్.జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం అని రాజా రవీంద్ర అన్నారు. ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఎన్నికలలో ప్రచారం చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఆయనను కలవలేదు. ఆయన మీద ఉన్న అభిమానంతోనే ప్రచారం చేశానని రాజా రవీంద్ర అన్నారు.