Agricultural Machinery : రైతులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
ప్రధానాంశాలు:
Agricultural Machinery : రైతులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
Agricultural Machinery : ఆంధ్రప్రదేశ్‌లో Andhra pradesh కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామంని చెబుతుంది. దీంతో పాటు రైతుల కోసం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికాలు అందించనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల కీలక ప్రకటన చేశారు. 2014-19 కాలంలో TDP టీడీపీ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల్ని 90 శాతం సబ్సిడీకి అందించింది. కేంద్రం కూడా రాయితీ ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలో రాష్ట్రంలో అమలు చేసి రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.గుంటూరులో ఓ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల షోరూమ్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాయితీపై యంత్ర పరికరాలు ఇస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనలో రైతులకు తగ్గింపుపై యంత్ర పరికరాలు ఇవ్వలేదని ఆరోపించారు. వ్యవసాయంలో రైతులకు యంత్ర పరికరాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు.
Agricultural Machinery సబ్సిడీపై ఇచ్చే యంత్ర పరికరాలు
పిచికారీ యంత్రాలు, ట్రాక్టర్లు, నాగళ్లు, పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు, ట్రాక్టర్ల కోసం పవర్ టిల్లర్లు, విత్తనాలు వేసే యంత్రాలు, రోటావేటర్లు, గడ్డిని కోసే, ముక్కలు చేసే యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, పసుపు ఉడికించే యంత్రం, వరి కోత యంత్ర పరికరాలు, డ్రోన్లు సబ్సిడీపై లభించనున్నాయి.
ప్రారంభం ఎప్పుడు ?
అంచనాల ప్రకారం జూన్ తర్వాత ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ లోగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చెయ్యాలనే ప్లాన్ ఉంది. అందువల్ల రైతులకు ఖరీఫ్ సీజన్ నుంచి రాయితీపై యంత్ర పరికరాలు అందుబాటులో ఉండే అవకాశం.