YS Jagan : అందరూ జగన్ ని టార్గెట్ చేయడం వెనక.. ఆయన ఎంత పవర్ఫుల్ అనేది అర్ధమైంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : అందరూ జగన్ ని టార్గెట్ చేయడం వెనక.. ఆయన ఎంత పవర్ఫుల్ అనేది అర్ధమైంది !

YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఎవరు చూసినా సీఎం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ పార్టీని ఓడించి ఏపీలో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసేందుకు కూడా వెనుకాడటం లేదు అంటే.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నూరైనా.. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 June 2023,11:00 am

YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఎవరు చూసినా సీఎం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ పార్టీని ఓడించి ఏపీలో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసేందుకు కూడా వెనుకాడటం లేదు అంటే.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఏపీలో ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసి.. సింహంలా సింగిల్ గా వస్తున్న వైఎస్ జగన్ ను ఓడించి తీరుతామని గప్పాలు కొడుతున్నారు కానీ.. అది అనుకున్నంత ఈజీ అయితే కాదు.

ఎందుకంటే.. అదేదో సినిమా డైలాగ్ లా పందులే గుంపుగా వస్తాయి.. కానీ సింహం లాంటి జగన్ నిజంగానే సింగిల్ గా వస్తారు. సింగిల్ గా వచ్చినా జగన్ ను మీరు ఏం చేయలేరు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వచ్చినా.. పోటీ చేసినా.. వైసీపీ గెలుపును మాత్రం ఆపలేరు. ఎందుకంటే.. ప్రస్తుతం సీఎం జగన్ వైపు ఏపీ ప్రజలు ఉన్నారు. ఏపీలో ఉన్న ప్రతి కుటుంబం జగన్ ను తమ ఆత్మ బంధువుగా చూస్తున్నారు. జగన్ ను ఒంటరి చేసి ఆయన్ను ఓడించాలని చివరకు కేంద్రం దగ్గర కూడా మంతనాలు జరుపుతున్నారంటే జగన్ ఎంత పవర్ ఫుల్ పర్సన్ అనేది అందరికీ అర్థం అవుతోంది.

all opposition parties in ap targeted ys jagan

all opposition parties in ap targeted ys jagan

YS Jagan : బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా.. కలిసి రాకున్నా చేసేదేం లేదు?

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కన్ఫమ్ అయినట్టే లెక్క. కానీ.. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసే అవకాశం లేకపోలేదు. ఇటీవలే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ అక్కడ బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. మరోవైపు బీజేపీ హైకమాండ్ ఏపీపై దృష్టి సారించింది. ఏకంగా బీజేపీ పెద్దలు ఏపీకి వచ్చి మరీ.. ఇక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అధికార వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రమే కదిలి వచ్చింది. ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అంటే.. నైతికంగా జగన్ గెలుపు ఎప్పుడో ఖాయం అయింది. సీఎం జగన్ వెంట ప్రజలు ఉన్నంత కాలం.. ఎన్ని పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నినా.. కేంద్రం కదిలివచ్చినా ఏం చేయలేరు. జగనన్న గెలుపును ఎవ్వరూ ఆపలేరు.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది