CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు
CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలకు, ప్రజల ఆశలకు నూతన స్పూర్తినిచ్చాయి. అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా ఐదు కోట్లమందికి సెంటిమెంట్‌గా అభివర్ణించారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేసిన ఆయన, మళ్లీ అదే విధంగా మోదీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభం జరగడం గర్వకారణమన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని నిర్మాణం నిలిచిపోయిందని, రైతులు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు
ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు, భారత్ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను గుర్తుచేశారు. పదో స్థానంలో ఉన్న దేశం, ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని, త్వరలో మూడో స్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కులగణన నిర్ణయాన్ని మోదీ తీసుకున్న నిర్ణయం గొప్పదిగా అభివర్ణించారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి రెండింటినీ లక్ష్యంగా పెట్టుకుని ప్రధాని పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతిని ప్రపంచంలో గుర్తింపు పొందే భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టిన ఈ పునర్నిర్మాణం, రాష్ట్ర ప్రజలకు కొత్త ఆశల రేకెత్తిస్తోంది. 5 లక్షలమంది విద్యార్థులు అక్కడ చదువుకునేలా శ్రేష్ఠ విద్యాసంస్థలను తీసుకురావడమే కాక, గ్రీన్ ఎనర్జీ ఆధారంగా కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం, నదుల అనుసంధానం, భోగాపురం ఎయిర్‌పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. అమరావతి పునర్నిర్మాణంతో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందినట్టు సీఎం వ్యాఖ్యలు సంకేతంగా నిలిచాయి.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.