Ambati Rambabu : అన్నను దొడ్డిదారిలో మంత్రిని చేస్తున్న తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి రాంబాబు
ప్రధానాంశాలు:
Ambati Rambabu : అన్నను దొడ్డిదారిలో మంత్రిని చేస్తున్న తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి రాంబాబు
Ambati Rambabu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan సోదరుడు నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. గతంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. అయితే ఆ ప్రణాళిక ఇప్పుడు మారినట్లుగా తెలుస్తోంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని పవన్ మొదట్లో సమర్ధించినప్పటికీ, ఇప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయ పాత్రను అందించడం మంచిదని భావిస్తున్నట్లుగా సమాచారం.

Ambati Rambabu : అన్నను దొడ్డిదారిలో మంత్రిని చేస్తున్న తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి రాంబాబు
నాగబాబును ఓ ప్రధాన కార్పొరేషన్ కు చైర్మన్‌గా నియమించనున్నట్లు లీకులు వెల్లడి అవుతున్నాయి. మంత్రివర్గంలో కుల సమతుల్యతను కొనసాగించాల్సిన అవసరం సైతం నాగబాబు మంత్రి పదవిపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన నుండి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అయితే మరొక కాపు నాయకుడిని, పవన్ సోదరుడిని చేర్చుకోవడం వల్ల సమాజంలోకి తప్పుడు సందేశం పంపినట్లు అవుతుందని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదల నాగబాబును ప్రకటించిన విషయం తెలిసిందే.
తమ్ముడికి శుభాకాంక్షలు
ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర విషయం చెబుతూ పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేశారు. అడ్డదారిలో అన్నని మంత్రి చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.