amit shah direct attack on ap cm ys jagan
Amit Shah : ఏంటో ఈ మధ్య బీజేపీ జాతీయ నేతలకు ఏపీపై తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ జాతీయ నేతలు ఏపీ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. వరుసగా మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఏకంగా ఏపీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టిన విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు.
తాజగా వైజాగ్ రైల్వే గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టిన అమిత్ షా.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఎక్కు పెట్టారు. ఏపీ ప్రభుత్వం వల్లనే ప్రగతి కనిపించడం లేదంటూ ఆయన ఆరోపణలు చేశారు. అసలు బీజేపీ పార్టీకి ఏపీ మీద ఎంత ప్రేమ లేకపోతే.. నిధులు ఎందుకు ఇస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటు నిధులు, పోలవరం నిధులు వేల కోట్లను ఏపీకి ఇచ్చాం అంటూ తమ గొప్పలు చెప్పుకున్నారు అమిత్ షా.
amit shah direct attack on ap cm ys jagan
ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం కోసం.. అధికార వైసీపీ పార్టీపై లేనిపోని బురద జల్లారు అమిత్ షా. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి కానీ.. 20 దాకా సీట్లు బీజేపీకి ఇవ్వాలని.. బీజేపీని ఏపీలో గెలిపిస్తేనే ఏపీ అభివృద్ధి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు తాము ఏపీకి ఏం చేశామో చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు కానీ.. ఏపీని సీఎం జగన్ ఎంత అభివృద్ధి చేశారు.. ఏపీలో ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చామో మాత్రం చెప్పలేకపోయారు. కేవలం బురద జల్లే రాజకీయాలకు బీజేపీ నేతలు తెర తీశారు అనడానికి తాజాగా జరిగిన ఈ మీటింగ్ లే ఉదాహరణ.
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
This website uses cookies.