Anchor Shyamala : ఎంతమంది సెలబ్రిటీలు వచ్చిన పిఠాపురంలో గెలిచేది వంగ గీతానే… యాంకర్ శ్యామల…!!

 Authored By ramu | The Telugu News | Updated on :5 May 2024,8:00 pm

Anchor Shyamala : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ నాయకులు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ సైతం ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటూ తమ అభిమాన రాజకీయ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారాలలో పాల్గొని తన బాబాయ్ కోసం మద్దతుగా నిలిచారు. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుదీర్ హైపర్ ఆది , గెటప్ శీను జనసేన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు.

ఇక వైసీపీ విషయానికొస్తే ప్రముఖ యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో తాజాగా ఓ ప్రచారాలలో భాగంగా శ్యామల పాల్గొనడం జరిగింది. గట్టి లీడర్ ను ఎదుర్కోవాలంటే ఆమాత్రం ఉండాలి… ప్రచారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం లో సినీ సెలబ్రెటీలు చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కేవలం వంగా గీత అనే మహిళను ఓడించడానికి ఇంతమంది అవసరమా అని అడగగా…దానికి శ్యామల సమాధానం ఇస్తూ..

వంగ గీత గారి రాజకీయ ప్రస్తావం చూసుకున్నట్లయితే ఆమె ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు పనిచేసారో అందరికీ తెలుసు. అలాగే ఆమె పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆమె చేయగలిగినంత చేసి చూపించారు. అంతేకాక పిఠాపురం నియోజకవర్గం లో ఆమె గురించి ప్రజలందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండేట్ ని ఎదుర్కోవాలి అంటే ఆ మాత్రం సపోర్ట్ కోరుకోవడంలో తప్పు లేదంటూ శ్యామల తెలియజేశారు. ఇక జబర్దస్త్ కు చెందినవారు ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారంటే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. వారిపై ప్రెషర్ కూడా ఉండవచ్చు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారి గెలుపు మాత్రం ఖాయం అయిపోయిందని , ఆమెని కొట్టడం ఇక ఎవరి తరం కాదంటూ శ్యామల తేలియజేశారు. దీంతో ప్రస్తుతం శ్యామల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి