SVSN Varma : కష్టపడి సాధించే విజయానికే గౌరవం, పవన్ కళ్యాణ్‌పై వర్మ సంచలన ట్వీట్
ప్రధానాంశాలు:
SVSN Varma : కష్టపడి సాధించే విజయానికే గౌరవం, పవన్ కళ్యాణ్‌పై వర్మ సంచలన ట్వీట్
SVSN Varma : పవన్ కళ్యాణ్ Pawan Kalyan గడిచిన ఆంద్రప్రదేశ్ andhra pradesh అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి Janasena పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవిని అలంకరించారు. అంతకుక్రితం ఎన్నికల్లో రెండు స్థానాలను నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే పవన్ పిఠాపురం pithapuram ఎంచుకోవడంతో అక్కడ పోటీకి సిద్ధమైన టీడీపీ TDP సీనియర్ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మ ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన కష్టపడ్డారు.

SVSN Varma : కష్టపడి సాధించే విజయానికే గౌరవం, పవన్ కళ్యాణ్‌పై వర్మ సంచలన ట్వీట్
పవన్ గెలుపులో కీలకంగా పనిచేసి వర్మ ఆ తర్వాత తనను పట్టించుకోవడం లేదన్న బాధో, లేక చంద్రబాబు-పవన్ కలిసి తాము అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్న హామీని గాలికొదిలేశారన్న బాధో తెలియదు కానీ మధనపడుతూ ఆవేదనకు గురౌతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఆయన తన సహచరుల వద్ద పిఠాపురంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిస్ధితులు, జనసేన క్యాడర్ తనకు దూరంగా ఉండటం వంటి అంశాల్ని ప్రస్తావించడాన్ని ఈ సందర్భంగా అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో దీనికి మరింత ఆజ్యం పోసేలా గురువారం వర్మ సంచలన ట్వీట్ చేశారు.
SVSN Varma కష్టపడి సాధించే విజయానికే గౌరవం
కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా ఆయన జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది. దీంతో పాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ ను గెలిపించాననే అర్ధం వచ్చేలా ఈ వీడియో ఉందని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన అభిమానులు సైతం ఈ పోస్టుకు విస్తృతంగా మద్దతుగా తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.