Andhra pradesh : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కీలక అప్డేట్…
ప్రధానాంశాలు:
Andhra pradesh : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కీలక అప్డేట్...
Andhra pradesh : ఆంధ్ర రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది.
ఏప్రిల్ రెండవ వారం లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్ని జరగనున్నట్లు సమాచారం.
Andhra pradesh : ఆంధ్ర రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది.అదేంటంటే 2024 మార్చి 13 లోపు మనదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ సమీక్షలు పూర్తిచేసుకునేే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి మార్చి 13 నుంచి 15 లేదా 16 లో ఒకరోజు కచ్చితంగా లోక్ సభ కు సంబంధించి నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మన దేశంలో ఇప్పటికే పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక వీటితోపాటు కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ మొదటి వారం నుండి లోక్ సభ ఎన్నికలు మొదలవుతాయి అని తెలుస్తుంది. ఇక ఏప్రిల్ రెండవ వారం లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్ని జరగనున్నట్లు సమాచారం. ఈ విధంగా మన భారతదేశంలో ఏప్రిల్ మొత్తం కూడా వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక వీటిలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు కూడా ఉంటాయి.
అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగడం ప్రారంభమవుతాయి. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 15 నుంచి 16లోపు రావచ్చు. ఈ క్రమంలోనే ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ విషయానికొస్తే ఏప్రిల్ 17 నుంచి 24 లోపు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రిసల్ట్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే 2019 ఎలక్షన్లలో చూసుకున్నట్లయితే 45 రోజులు పాటు వెయిట్ చేసిన తర్వాత ఎన్నికల రిజల్ట్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను మొత్తం దేశంలోని లోక్ సభ ఎన్నికలతో పాటు కలిపి చూస్తారు కాబట్టి మే నెల ఆఖరి వరకు రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 2019లో జూన్ మధ్యలో ప్రభుత్వం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు 2024లో జూన్ మధ్య నుంచి కొత్త ప్రభుత్వం ప్రారంభమవుతుంది. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2024 మే నెల ఆఖరి కల్లా ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వస్తుందని చెప్పాలి. అయితే గత ఏడాది మాదిరిగానే 40 నుండి 45 రోజులు రిజల్ట్ కోసం వేచి చూడక తప్పదు అని చెప్పాలి.. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాలను కామెంట్స్ లో తెలియజేయండి.