Annadata Sukhi Bhava : గుడ్‌న్యూస్.. ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ నిధుల జమ !
ప్రధానాంశాలు:
Annadata Sukhi Bhava : ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ నిధుల జమ !
Annadata Sukhi Bhava : ఎన్నికల హామీలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు Chandrababu హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని Annadata Sukhi Bhava అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. అర్హులెంత మంది? ఎంత మొత్తంలో అందించాలి? అన్నదానిపై అధ్యయనం పూర్తి చేసింది. దాంతో రైతులు నిధుల జమపై ఆశగా ఎదురుచూస్తున్నారు.
Annadata Sukhi Bhava నిధుల సమీకరణలో ప్రభుత్వం
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా rythu bharosa పేరిట ఉన్న పథకం పోర్టల్ ను అన్నదాత సుఖీభవగా మార్చింది. అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ఈ నగదు అందిస్తారని రైతులు farmers ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. సంక్రాంతి( Pongal) నాటికి అన్నదాత సుఖీభవ పథకం Annadata Sukhi Bhava ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ అది కూడా జరుగలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడత రూ.2 వేలు ఫిబ్రవరిలో అందించనుంది. అన్నదాత సుఖీభవకు Annadata Sukhi Bhava సంబంధించి కూడా అప్పుడే నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి నిధులు సమీకరణలో పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సమయత్తమౌతుంది. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది కూడా. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేయనుంది. సచివాలయాల వారీగా జాబితాలను రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం.
విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం
మరోవైపు తల్లికి వందనం పథకానికి సైతం కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.20 వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.