Chandrababu : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ.. షాక్‌లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ.. షాక్‌లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్

 Authored By kranthi | The Telugu News | Updated on :2 November 2023,6:03 pm

ప్రధానాంశాలు:

  •  అక్రమ ఇసుక కేసులో చంద్రబాబుపై మరో కేసు

  •  మరో ముగ్గురు టీడీపీ నేతలపై కూడా కేసు

Chandrababu : నిన్న గాక మొన్ననే చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కదా. కానీ.. అంతలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. మరో కేసులో చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో నిర్బంధించారు. 52 రోజుల తర్వాత అనారోగ్య కారణాల వల్ల కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం చంద్రబాబు బయటే ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్ కేసుల విషయంలో కూడా చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసును సీఐడీ నమోదు చేసింది. ఇసుక అక్రమాలపై ఇప్పుడు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ కేసును సీఐడీ అధికారులు నమోదు చేశారు.

టీడీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపైనే ఈ కేసును సీఐడీ అధికారులు నమోదు చేశారు. ఇందులో ఏ1గా టీడీపీ నాయకురాలు పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు పేరు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4 దేవినేని ఉమ పేర్లను చేర్చారు. ఇసుక అక్రమాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వీళ్లంతా వ్యవహరించారని ఏపీ ఎండీసీ ఫిర్యాదులో తెలిపింది. ఉచిత ఇసుక పేరుతో రూ.10 వేల కోట్ల స్కామ్ కు తెరలేపారని.. దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వచ్చిందని తెలిపారు. టీడీపీ హయాంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. వీళ్లతో పాటు పలువురు ఇతర వ్యక్తులపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది