Ap Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ .. మెగా డీఎస్సీ, పెన్షన్లకు క్యాబినెట్ ఆమోదం..!
ప్రధానాంశాలు:
Ap Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ .. మెగా డీఎస్సీ, పెన్షన్లకు క్యాబినెట్ ఆమోదం..!
Ap Cabinet Meeting : ప్రస్తుతం ఏపీలో సీఎం చంద్రబాబు Chandrababu Naidu సమక్షంలో ఏపీ మంత్రివర్గ Ap Ministers సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మొదట చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గ ఆమోదం ఇచ్చింది. ముందుగా మెగా డీఎస్సీ కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వార 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, 4 వేల పించను, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన నిర్ణయాల మీద మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
డీఎస్సీ నిర్వహణకు సంబందించి కొత్తగా టెట్ పరీక్ష నిర్వహించాలా లేదా టెట్ లేకుండానే డీఎస్సీ వేయలా అన్న ప్రతిపాదల మెద చర్చ జరిగింది. జూలై నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి డిసెంబర్ 10లోపు పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళిక వేయాలని నిర్ణయించుకున్నారు.

Ap Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ .. మెగా డీఎస్సీ, పెన్షన్లకు క్యాబినెట్ ఆమోదం..!
పించను పెంపుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3 వేల ఇస్తున్న పించను 4 వేలకు పెంచింది. జూలై 1 నుంచి పెంచిన పించను ఇంటి వద్దకే అందేలా నిర్ణయించారు. ఐతే ఎన్నికల్లో ఇచినట్టుగా 7 వేల పించనుపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గత 3 నెలలకు కలిపి ఒక్కొక్కరికి 7 వేల పించను ఇచ్చేలా ఆమోదం తెలిపింది. ఈ 7 వేల పించను రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని తెలుస్తుంది.