Chandrababu Naidu : 4400 కోట్ల స్కామ్ లో బిగ్ ట్విస్ట్.. సీఐడీ విచారణలో తేలింది ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : 4400 కోట్ల స్కామ్ లో బిగ్ ట్విస్ట్.. సీఐడీ విచారణలో తేలింది ఇదే..!

 Authored By tech | The Telugu News | Updated on :14 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : 4400 కోట్ల స్కామ్ లో బిగ్ ట్విస్ట్.. సీఐడీ విచారణలో తేలింది ఇదే..!

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4400 కోట్ల స్కాం ను చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా దీనిపై చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అరెస్టు చేశారో ఈ కేసులో కూడా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తూ కొన్ని నెలల ముందు అమరావతి లో ఉండే అసైన్డ్ భూములను తన బినామీలు మాజీ మంత్రి నారాయణరెడ్డి యొక్క బినామీలుగా మార్చేసుకున్నారని సిఐడి ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దీనిని నిరూపించేందుకు సీఐడీ చాలా ప్రయత్నాలు చేస్తుంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలను ఎలా సమర్థవంతంగా నిరూపించారో ఈ కేసులో కూడా ఆధారాలను ఎలా సమర్పిస్తుంది అనేది ప్రశ్నగా మారింది. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరు అరెస్టు అయ్యే పరిస్థితి ఉందా అని చర్చ జరుగుతుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఇతర మంత్రులు వారి బినామీలు భూమిని కబ్జా చేశారని సీఐడీ ఆరోపించింది.

ల్యాండ్ పోలింగ్ పథకం కింద అసైన్డ్ భూములు ప్రభుత్వం లాక్కుంటుంది అని ధీమాతోనే వారికి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా తక్కువ ధర తోనే భూములను కొనుగోలు చేశారని సీఐడీ చార్జ్ షీట్లో పేర్కొంది. ఆ తర్వాత అసైన్డ్ భూములను ల్యాండ్ పోలింగ్ పద్ధతి ద్వారా లబ్ధి పొందేందుకు ఒక జీవో జారీ చేయాలని మంత్రులు అప్పటి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిందితులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, అంజనీ కుమార్, ఉమ్మడి సురేష్, కొల్లి శివరామ్ లతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని వారు అప్పటి మంత్రులు బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు. నిషేధిత జాబితాలోని భూములపై రిజిస్ట్రేషన్లు, జీపీఏ లు అనుమతించాలంటూ మంగళగిరిలోని సబ్ రిజిస్టార్ అధికారులపై ఒత్తిడి తీసుకురాగా విద్యా సంస్థల నుంచి సుమారు 16 కోట్ల నిధులు వచ్చినట్లుగా విచారణలో స్పష్టమైన ఆధారాలను సీఐడీ సమర్పించింది. అపట్లో నారాయణ కు కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. ఇందులో నుంచే 16 కోట్ల ట్రాన్స్ఫర్ అయిందని ఈ ఒక్క అంశం సీఐడీ కి దొరికిందని దాంతో వాళ్ళు ముందుకెళుతున్నారని అంటున్నారు.

ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు అసైన్డ్ భూముల రైతులకు చెల్లించి నారాయణ బినామీల పేర్లు అక్రమ ఒప్పందాలను పొందారని సీఐడీ అంటుంది. అతడు తనకోసం 162 ఎకరాల అసైన్డ్ భూములు అక్రమంగా సంపాదించాడు. చంద్రబాబు నాయుడు నారాయణకు రాజకీయంగా సన్నిహితంగా ఉన్న ఇతర అనుచరులు కూడా వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారని సీఐడీ స్పష్టం చేసింది. 164 సెక్షన్ కింద మెజిస్ట్రేట్ ముందు నిలదీశారని అప్పటి అడ్వకేట్ జనరల్ హైకోర్టు లా సెక్రటేరియట్ అభిప్రాయాలను ఐఏఎస్ లేవనెత్తిన అభ్యంతరాలను అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు నారాయణ జీవో 41ని జారీ చేశారని ఏజెన్సీ పేర్కొంది. అయితే దీనిపై టీడీపీ దీనిని ఇన్సైడ్ ట్రేడింగ్ అని నానా హడావిడి చేశారు. అది కూడా సుప్రీం లో నిలబడలేదు కదా ఇప్పుడు ఎలక్షన్ ముందు కొత్త అంశాన్ని తీసుకొచ్చారు తప్ప ఇందులో జరిగే పరిస్థితి లేదని ప్రూవ్ చేసే అంశాలు కూడా లేవు అంటూ టీడీపీ దీనికి కౌంటర్ ఇస్తుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది