YS Jagan Mohan Reddy : వైఎస్ జగన్ ఆశ్రమాల బాట… ఆ ముద్ర తొలగించుకోవడానికేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan Mohan Reddy : వైఎస్ జగన్ ఆశ్రమాల బాట… ఆ ముద్ర తొలగించుకోవడానికేనా?

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహార తీరుపై ప్రజెంట్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. జగన్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారని, మూడేళ్ల ముందుగానే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారా అని అనుకుంటున్నారు. ప్రత్యర్థులకు సైతం అంతు చిక్కకుండా వ్యూహాలు మార్చుకుని జగన్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. YS Jagan Mohan Reddy : వరుస ఆశ్రమాల సందర్శనలో సీఎం జగన్.. వైసీపీ అధినేత అయినటువంటి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 October 2021,5:50 pm

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహార తీరుపై ప్రజెంట్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. జగన్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారని, మూడేళ్ల ముందుగానే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారా అని అనుకుంటున్నారు. ప్రత్యర్థులకు సైతం అంతు చిక్కకుండా వ్యూహాలు మార్చుకుని జగన్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ap cm ys jagan changed his plans

ap cm ys jagan changed his plans

YS Jagan Mohan Reddy : వరుస ఆశ్రమాల సందర్శనలో సీఎం జగన్..
వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్ అధికారంలోకి భారీ మెజార్టీతో వచ్చారు. అయితే, ఆయనపై క్రిస్టియన్ అనే ముద్ర ఉండగా, దానిని తొలగించేందుకుగాను జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థాన సందర్శన అనంతరం జగన్ ప్రజెంట్ వరుసగా ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. బీజేపీ, టీడీపీ ఇటీవల జగన్ హిందూ వ్యతిరేకి అనే ప్రచారం చేసేందుకుగాను ప్రయత్నించగా, కౌంటర్ అటాక్‌గా జగన్ ఇలా చేస్తున్నారేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు అంతు చిక్కకుండా జగన్ అందరి కంటే ముందుగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనూ ఉంది.

ap cm ys jagan changed his plans

ap cm ys jagan changed his plans

మొత్తంగా జగన్ ఆశ్రమాల సందర్శన విషయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పొచ్చు. ఇకపోతే విజయవాడ పటమట దత్తనగర్ సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని, విశాఖ శారదా పీఠం ఆశ్రమాన్ని జగన్ సందర్శించారు. శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర తెలిపినట్లుగానే ఏపీ సీఎం జగన్ పూజలు కూడా చేశారు. గంగాస్నానం ఆచరించి శ్రద్ధతో పూజలు కంప్లీట్ చేశారు. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో తాను హిందూ వ్యతిరేకిని కాదు అనే సంకేతాలను పంపించడంలో భాగంగానే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే అభిప్రాయం వైసీపీ కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధితో పాటు అన్ని మతాలను గౌరవిస్తుందని జగన్ చెప్పకనే చెప్తున్నారనే పలువురు అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ జగన్ ఇప్పటి నుంచే తన ఫోకస్‌ను అన్ని వర్గాలపై పెడుతున్నారని అర్థమవుతున్నది. ఇకపోతే ఏపీలో మంత్రి వర్గంలో మార్పులపైన వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. త్వరలో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోండగా, ఎవరెవరికి ఉద్వాసన ఉంటుంది? ఎవరెవరు కొత్తగా కేబినెట్‌లోకి రానున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది