Ap Farmers : రైతులకు చంద్రన్న గుడ్ న్యూస్.. మిస్ చేసుకుంటే మీకే నష్టం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ap Farmers : రైతులకు చంద్రన్న గుడ్ న్యూస్.. మిస్ చేసుకుంటే మీకే నష్టం

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Ap Farmers : రైతులకు చంద్రన్న గుడ్ న్యూస్.. మిస్ చేసుకుంటే మీకే నష్టం

Ap Farmers : ఏపీలో కూటమి Andhra pradesh Govt ప్రభుత్వం చేపట్టిన ఓ పథకం ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నదాతలకు ఆశాజనకంగా మారుతోంది. సూక్ష్మ సాగు నీటి పథకం కింద అర్హత కలిగిన రైతులకు డ్రిప్ సేద్యం పరికరాలను భారీ సబ్సిడీతో అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే కడప జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఈ పరికరాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, 14 వేల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.

Ap Farmers రైతులకు చంద్రన్న గుడ్ న్యూస్ మిస్ చేసుకుంటే మీకే నష్టం

Ap Farmers : రైతులకు చంద్రన్న గుడ్ న్యూస్.. మిస్ చేసుకుంటే మీకే నష్టం

Ap Farmers  రూ. 4 లక్షలు పొందే ఛాన్స్ ను రైతులకు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన రైతులకు ఐదు ఎకరాల లోపు పొలం ఉంటే 100 శాతం రాయితీ వర్తించనుంది. అంటే వారు డ్రిప్ పరికరాలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఐదు నుండి పది ఎకరాల పొలం ఉన్నవారికి 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నవారికి 50 శాతం రాయితీ లభిస్తుంది. రాయితీ శాతాలు బట్టి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల విలువైన పరికరాలు పొందే అవకాశం ఉంది. రైతులు తాము అర్హులేనా అనే విషయాన్ని నిర్ధారించుకొని, ఆర్‌బీకే సెంటర్లలో దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా నీటిని నేరుగా మొక్కల రూట్ల ప్రాంతానికి చుక్కల రూపంలో అందించడం వల్ల నీటి వృథా తగ్గుతుంది. ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా, ఈ పద్ధతిలో ఎరువులు కూడా నీటితో కలిపి మొక్కలకు నేరుగా అందించవచ్చు. ఈ సాంకేతికత వల్ల పంటల దిగుబడి మెరుగవడంతో పాటు పెట్టుబడి తక్కువగా ఉండటం ద్వారా రైతులు లాభపడతారు. ఇది కేవలం రైతులకే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు తప్పకుండా వినియోగించుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది