AP Government Credit : ఏపీ అప్పులు.. జగన్ ని మరిపిస్తున్నారుగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Government Credit : ఏపీ అప్పులు.. జగన్ ని మరిపిస్తున్నారుగా..?

AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో కొన్ని అనుమానాలకు దారిస్తున్నారు. ముఖ్యంగ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడగా ఎన్నికల టైం లో ప్రభువం చేసిన అప్పుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రచారంలో వారి ఒక అస్త్రంగా అది ఉంది. ఐతే రాష్ట్రంలోకి అధికారం లోకి వచ్చాక పెన్షన్ హామీ ఒక్కటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 October 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Government Credit : ఏపీ అప్పులు.. జగన్ ని మరిపిస్తున్నారుగా..?

AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో కొన్ని అనుమానాలకు దారిస్తున్నారు. ముఖ్యంగ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడగా ఎన్నికల టైం లో ప్రభువం చేసిన అప్పుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రచారంలో వారి ఒక అస్త్రంగా అది ఉంది. ఐతే రాష్ట్రంలోకి అధికారం లోకి వచ్చాక పెన్షన్ హామీ ఒక్కటి అమలు చేస్తున్నారు. ఐతే ఈ క్రమంలో కూటమి ప్రభువం చేసిన అప్పుల లెక్కలు షాక్ ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుగా 7 వేల కోట్లు అప్పుగా ఇచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధం లోనే వాడుకునేలా 47000 కోట్లు కేంద్రం అప్పుగా ఇవ్వగా సెప్టెంబర్ లాస్ట్ కల్లా ఆ పరిమితి ముగిసింది. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వాడుకునేందుకు మరో 7000 కోట్లు అనుమతి వచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో అప్పు చూస్తే 54000 కోట్లు ఉంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో 3000 కోట్లు అప్పుగా తీసుకుంది. సో సెక్యురిటీ వేలంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో మొత్తం తెచ్చిన అప్పు 50000 కోట్లకు చేరింది.

AP Government Credit జూన్ 12న నాటికి 59వేల కోట్ల అప్పుతో..

జూన్ 12న నాటికి 59వేల కోట్ల అప్పుతో ప్రభుత్వం మొదలు పెట్టగా ఎన్నికల హామీల్లో భాగంగా 3 వేల నుంచి 4 వేల దాకా పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారు. ఇక ఇతర సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం కుదరలేదు. గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళిఒ నుంచి అమలు చేయాలని చూస్తున్నారు. ఈ 4 నెలల 20 రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం మొత్తం 59 వేల కోట్లు అప్పు చేసింది.

AP Government Credit ఏపీ అప్పులు జగన్ ని మరిపిస్తున్నారుగా

AP Government Credit : ఏపీ అప్పులు.. జగన్ ని మరిపిస్తున్నారుగా..?

కూటమి ప్రభుత్వం మరో 8 వేల కోట్లు మార్క్ ఫెడ్ ద్వారా 5 వేల కోట్లు, పౌర సరఫరాల ద్వారా 2 వేల కోట్లు ఏపీఐఐసీ ద్వారా మరో వెయ్యి కోట్లు రుణం తీసుకుంది. అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండానే ఇన్ని అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం నవంబర్ 11న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించింది. ఐతే ప్రభుత్వం ఏర్పాటై నాలుగున్నర నెలల కాలంలో అప్పులు, ఖర్చులపై అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది