Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?
ప్రధానాంశాలు:
Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి...? తింటే ఇక అంతే...?
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ వెల్లుల్లి మరియు ఉల్లిపాయాలను హిందూ ఆహార తత్వశాస్త్రంలో తామసిక ఆహారంగా పేర్కొకొనడం జరిగింది. ఇవి మనిషి యొక్క మనసులో అజ్ఞానాన్ని అంధకారాన్ని పెంచుతాయని అలాగే మానవ శరీరంలో కోరికలను పెంచుతాయని చెబుతుంటారు. అందుకే వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను రజోగుణాలు కలిగిన ఆహారంగా భావిస్తారు. అంటే వీటిని తినడం వలన విపరీతమైన కోరికలు కలుగుతాయని అర్థం. అందుకే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూజలు చేసే సమయంలో లేదా మాల ధరించిన సమయంలో వ్రతాలు శుభకార్యాలు చేసే సమయంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను తినకూడదని నిషేధించడం జరిగింది. వెల్లుల్లి మరియు ఉల్లిపాయ అనేది రాహుకేతులకు సంబంధించినగా చెప్పబడతాయి. హిందూమతంలో ఉపవాసం లేదా పూజ చేసే సమయంలో తామసిక ఆహారం అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తామసిక ఆహారాన్ని తిని పూజిస్తే ఫలితం దక్కదని నమ్ముతారు.
అందుకే చాలామంది హిందువులు సనాతన ధర్మం నమ్మకాల ప్రకారం వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను అసలు తినరు. అలాగే ఇంకొంతమంది ఉపవాసం పూజలు చేసే సమయంలో పూర్తి ఫలితాలను పొందాలని భావించి వెల్లుల్లి ఉల్లిపాయలను తినరు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం కేవలం పూజలు వ్రతాలు చేసే సమయంలో మాత్రమే కాకుండా నెలలో మరో ఐదు రోజులు కచ్చితంగా వెల్లుల్లి ఉల్లిపాయలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. హిందూశాస్త్రం ప్రకారం నెలలో ఈ ఐదు రోజులు వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను తినడం నిషేధించబడిందని చెబుతున్నారు. ఇక ఈ సమయంలో వెల్లుల్లి ఉల్లిపాయలకు చాలా దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు. మరి ఆ 5 రోజులు ఏమిటి..? దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Onion And Garlic : అమావాస్య…
అమావాస్య అనేది పూర్వీకుల తిధికి సంబంధించినది. ఇక ఈ అమావాస్య రోజు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదం పొందేందుకు దానధర్మాలు చేస్తూ ఉంటారు. అందుకే ఈ అమావాస్య రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు. పూర్వీకుల అనుగ్రహం కోసం వీటిని తినకుండా ఉండడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
పౌర్ణమి : ప్రతి నెల వచ్చే పౌర్ణమిని హిందూ శాస్త్రంలో ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇక ఈ పౌర్ణమి తిథి లక్ష్మీదేవి సోదరుడిగా పిలవబడే చంద్రునికి సంబంధించినది. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకోకూడదు.
ఏకాదశి : ప్రతినెల ఏకాదశి తిథి రెండుసార్లు వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజు చాలామంది విష్ణువును పూజిస్తూ ఉంటారు. అందుకే ఏకాదశి రోజు విష్ణుకు అంకితం చేయబడింది. ఇక ఈరోజు కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు అసలు తీసుకోకూడదు.
గణేష్ చతుర్థి : ప్రతి నెల రెండుసార్లు చవితి తిధి అనేది వస్తుంది. ఈ తిధి రోజున వినాయకుని ఎక్కువగా పూజిస్తారు. ఇక ఈ సమయంలో వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకోకూడదు.