AP Ration Card : రేషన్ కార్డు పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసిన ఏపీ సర్కార్..!
AP Ration Card : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ సరుకుల పంపిణీ విధానంలో జూన్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పౌరసరఫరాల శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నట్లు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మార్పుల ద్వారా మునుపటి ఎండీయూ వాహనాలపై ఆధారపడే విధానాన్ని పూర్తిగా తొలగించి, స్థిరమైన రేషన్ షాపుల నుంచే సరుకులు అందుబాటులోకి రానున్నాయి.

AP Ration Card : రేషన్ కార్డు పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసిన ఏపీ సర్కార్..!
AP Ration Card : ఏపీలో ఆ సమయంలో మాత్రమే రేషన్ పంపిణీ చేస్తారు
ఇకపై నెలలో ప్రతి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఆదివారాల్లో కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. గతంలో ఎండీయూ వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియక, కార్డుదారులు రోడ్లపై వేచిచూసే పరిస్థితి ఉండేదని ఆయన తెలిపారు. తాజా మార్పులతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఈ కొత్త విధానం అమలులోకి రావడానికి ముందు విజయవాడ మధురానగర్‌లో ఉన్న రేషన్ డీపో నంబర్ 218 ను పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్‌తో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడ రేషన్ డీలర్ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించారు. ఇందులో లాగిన్ నుంచి కార్డు నంబర్ నమోదు, కార్డుదారుని వేలిముద్ర లేదా కంటిపాప ద్వారా గుర్తింపు ప్రక్రియ వరకు అన్నీ ఎలా పని చేస్తున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు. దీనివల్ల కార్డుదారులకు అందుబాటులో, పారదర్శకంగా, వేగంగా సరుకులు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.