Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై వారికి రేషన్ బియ్యం కట్..!
ప్రధానాంశాలు:
Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై వారికి రేషన్ బియ్యం కట్..!
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే చేరేలా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అనర్హుల వద్ద ఉన్న తెల్ల రేషన్ కార్డు లను గుర్తించి రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆపరేషన్ చేపట్టి బోగస్ మరియు అనర్హ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారుల ద్వారా అనుమానాస్పద కార్డుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటిని జిల్లాల వారీగా పంపిణీ చేసింది. ఈ చర్యలతో రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాకుండా అక్రమంగా బియ్యం తరలింపును పూర్తిగా నియంత్రించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై వారికి రేషన్ బియ్యం కట్..!
Telangana Ration : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేగవంతమైన పరిశీలన
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని సుమారు 2,027 చౌక ధరల దుకాణాల పరిధిలో దాదాపు 9.60 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రాథమిక విచారణలో లక్షకు పైగా కార్డులు అనర్హుల వద్ద ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి అందిన జాబితాలను మండల రెవెన్యూ అధికారులు డీలర్లకు అందజేస్తున్నారు. ప్రతి రేషన్ కార్డుదారుడి వివరాలను ఇంటింటి సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులా కాదా అన్నది నిర్ధారించనున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాకే తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Telangana Ration : అర్హులకు అన్యాయం జరగదు..అధికారుల భరోసా
రేషన్ కార్డు పొందేందుకు ప్రభుత్వం స్పష్టమైన అర్హతా ప్రమాణాలను నిర్దేశించింది. ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించి ఉండటం ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు రెండున్నర ఎకరాలకంటే ఎక్కువ సాగుభూమి కలిగి ఉన్నవారు అనర్హులుగా పరిగణించబడతారు. అయితే గతంలో పాత విధానాల కారణంగా కొందరు అనర్హులు కూడా తెల్ల రేషన్ కార్డులు పొందారని అధికారులు గుర్తించారు. ఇటీవల జారీ చేసిన కొత్త కార్డుల్లోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కేవలం జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన రేషన్ కార్డు రద్దు చేయబోమని క్షేత్రస్థాయి విచారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అర్హులైన పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని వ్యవస్థను శుద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. బోగస్ కార్డుల ఏరివేత ద్వారా మిగిలే బియ్యం నిధులను నిజమైన పేదల సంక్షేమానికి వినియోగించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.