Pashu Bima Scheme : ఏపీ రైతులకు శుభవార్త.. 30 వేలు ఇస్తున్న సీఎం చంద్రబాబు..!
Pashu Bima Scheme : ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాపరిపాలన లో భాగంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి తో పాటు పలు సంక్షేమ పథకాలను కూడా ఈక్వెల్ గా తీసుకెళ్తుంది. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. ఐతే రైతుల కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అన్నదాతల కోసం పశు భీమా పథకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పశువులతో పాటు గొర్రెలు, మేకలు, […]
Pashu Bima Scheme : ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాపరిపాలన లో భాగంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి తో పాటు పలు సంక్షేమ పథకాలను కూడా ఈక్వెల్ గా తీసుకెళ్తుంది. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. ఐతే రైతుల కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అన్నదాతల కోసం పశు భీమా పథకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పశువులతో పాటు గొర్రెలు, మేకలు, పందులకు కూడా బీమా సౌకర్యం అమలు చేస్తున్నారు.
నాటు పశువులకు 15 వేలు, మేలు జాతి వాటికి 30 వేలు బీమా ప్రభుత్వం అందిస్తుంది. ఐతే ఎవరైనా రైతులు 30 వేలకు పైన బీమా చేయాలని అనుకుంటే అందుకు అవసరమైన సొమ్ము చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పశువుల బీమా మూడు సంవత్సరాల కాల పరిధితో ఉంటుంది. జిల్లాల వారిగా రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి మేలు జాతి పశువు కనీసం లక్ష చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా అలాంటి వాటికి బీమా చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Pashu Bima Scheme : పశువుల చెవికి ట్యాగ్..
ఐతే బీమా కోసం ప్రీమియం ఉంటుంది. దాన్ని చెల్లిస్తే ప్రభుత్వం పశువులకు బీమా అందిస్తుంది. ఈ బీమా సౌకర్యం తీసుకున్న వారికి చెవికి ట్యాగ్ వేస్తారు. బీమా చేసుకోవాలంటే రైతు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, ఎస్సీ, ఎస్టీ లు ఐతే తెల్ల రేషన్ కార్డ్ అందించి పశు సంవర్ధకశాఖ కు అందించాలి. పశువులు మరణిస్తే వెంటనే సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. బీమా సంబందింత సర్వేయర్ వచ్చి మరణించిన జీవిని చూసి చెవికి ఉన్న ట్యాగ్ ప్రకారం వాటి బీమా అందిస్తారు. ఐతే అప్పటివరకు వాటికి చెవికి ఉన్న ట్యాగ్ తీయకూడదు. చెల్లించిన ప్రీమియం ఇంకా పశువువు వివరాలు సరి చూసుకుని దానికి రావాల్సిన బీమా మొత్తాన్ని ఆ రైతుకి అందిస్తారు.